Samyuktha Menon : పెళ్లైన వ్యక్తితో ప్రేమాయణం ఏంటి.. సంయుక్త ఎఫైర్‌పై మండిపడుతున్న నెటిజన్లు..!

సినీ ఇండస్ట్రీలో పుకార్లు చాలా ఈజీగా షికార్లు చేస్తుంటాయి.

Update: 2023-05-29 14:40 GMT

దిశ, వెబ్‌డెస్క్: సినీ ఇండస్ట్రీలో పుకార్లు చాలా ఈజీగా షికార్లు చేస్తుంటాయి. నటీనటులపై అయితే పెద్ద ఎత్తునే ఎగిసిపడుతుంటాయి. హీరోయిన్ డైరెక్టర్‌తో లేక హీరోలతో కాస్త చనువువగా ఎక్కడైన కనిపిస్తే ఇద్దరి మధ్య ఎఫైర్లు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయిపోతాయి. అయితే కొన్ని సార్లు ఇలాంటి వార్తలపై నటీనటులు స్పందించి వాటిపై ఓ క్లారిటీ ఇస్తారు. కొంత మంది మాత్రం మాకు అవసరం లేదంటూ వదిలేస్తారు. ఈ క్రంమలోనే తాజాగా.. హీరోయిన్ సంయుక్త మీనన్‌పై ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

‘సార్’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న సంయుక్త.. ‘విరుపాక్ష’ తో కుర్రాలకు క్రష్‌గా మారిపోయింది. దీంతో అమ్మడు ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోవడంతో.. వరుస సినిమాలతో బిజీగా ఉంటుంది ఈ బ్యూటీ. ఇదిలా ఉంటే.. సంయుక్త మీనన్‌పై సోషల్ మీడియాలో ఓ వార్త జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈమె కోలీవుడ్‌కి చెందిన ఓ స్టార్ హీరోతో ప్రేమాయనం నడుపుతుందట.

ఆ హీరో గతంలో ప్రేమ పెళ్లి చేసుకుని విడాకులు కూడా తీసుకున్నాడని టాక్. అతడు ఒప్పుకుంటే సంయుక్త అతడినే పెళ్లి చేసుకోవాలి అనుకుంటుందట. ఆ హీరోకి కూడా సంయుక్త అంటే ఇష్టమేనట. అయితే ఆ హీరో ఎవరు అనేది సీక్రెట్‌గా ఉంచుతుందట సంయుక్త. దీంతో కెరీర్ ఫామ్‌లో ఉన్న టైంలో పెళ్లైన వ్యక్తితో ప్రేమాయణం ఏంటి అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. అయితే ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో ట్రోల్స్ మాత్రం ఓ రేంజ్‌లో వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి:

Samantha or Sri Leela :హాలీవుడ్ ‘చెన్నై స్టోరీ’లో సమంత లేక శ్రీలీల?  

Glamorous Looks Of Yukti Thareja hot indian model in Black Saree  

Tags:    

Similar News