క్రీడారంగంలోకి హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఎంట్రీ..!

ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మొదట్లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా దూసుకెళ్లింది ‘రకుల్ ప్రీత్ సింగ్’.

Update: 2023-09-06 06:53 GMT
క్రీడారంగంలోకి హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఎంట్రీ..!
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మొదట్లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా దూసుకెళ్లింది ‘రకుల్ ప్రీత్ సింగ్’. ‘సరైనోడు, ధృవ, ఖాకి, దేవ్, జయ జానకి నాయక, నాన్నకు ప్రేమతో’ లాంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు పెద్దగా అవకాశాలు రావట్లేదు. ఇకపోతే తాజాగా ఈ అమ్మడు టెన్నిస్ జట్టును కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఐపీఎల్‌, ఫుట్‌బాల్‌ లీగ్‌, కబడ్డీ లీగ్‌ తరహాలో టెన్నిస్‌ ప్రీమియర్‌ లీగ్‌ నిర్వహిస్తున్న హైదరాబాద్‌ జట్టులో రకుల్‌ పెట్టుబడులు పెట్టిందట.

హైదరాబాద్ స్ట్రైకర్స్ టీమ్‌‌కు రకుల్ ప్రీత్ సింగ్, నవీన్ దాల్మియా, రాజ్‌దీప్ దాల్మియా, నికుంజ్ షా యజమానులుగా వ్యవహరించనున్నారు. ఈ సందర్భంగా రకుల్ మాట్లాడుతూ.. ‘దేశంలోని ప్రతిభావంతులైన టెన్నిస్ క్రీడాకారులు తమ నైపుణ్యాలను ప్రదర్శించడానికి, క్రీడల్లో మంచి పేరు దక్కించుకోడానికి టెన్నిస్‌ ప్రీమియర్‌ లీగ్‌ మంచి వేదిక. భారత టెన్నిస్‌కు హైదరాబాద్ చాలా కాలం నుంచి పేరు పొందింది. హైదరాబాద్ స్ట్రైకర్స్‌తో ఆ ఖ్యాతిని మరింత పెంచాలనుకుంటున్నాం’’ అంటూ వెల్లడించింది.

ఇవి కూడా చదవండి:   Hebah Patel: శారీలోనూ సెగలు పుట్టిస్తున్న హెబ్బా పటేల్

Tags:    

Similar News