Praneetha: గూగుల్‌లో అవి సెర్చ్ చేస్తున్న హీరోయిన్ ప్రణీత..!
టాలీవుడ్ హీరోయిన్ ప్రణీత తెలుగులో పలు సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది.
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ ప్రణీత తెలుగులో పలు సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది’ సినిమాతో ఫేమ్ అయ్యింది. ఈ ముద్దుగుమ్మ హీరోయిన్‌గా కంటే వ్యక్తిగతంగా మంచి పేరు సంపాదించుకుంది. ప్రణీత ఫౌండేషన్ పేరు మీద ఇప్పటికీ సహాయం చేస్తూనే ఉంటుంది. ఇక సినిమాలతో బిజీగా ఉన్న సమయంలోనే తన స్నేహితుడు ప్రముఖ వ్యాపారవేత్త నితిన్ రాజు అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని పూర్తిగా సినిమాలకు దూరం అయ్యింది. ఇటీవలే ఈ భామ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పాపకు సంబంధించిన పిక్స్‌ను ఎప్పటికప్పుడూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. అయితే తాజాగా ప్రణీత ‘వన్ ఇయర్ బేబీ ఫుడ్ తినడం లేదని’ గూగుల్‌లో సెర్చ్ చేసినట్లు సమాచారం. దీంతో నెటిజన్లు ప్రణీత ఇవి కూడా వెతుకుతుందా..? అంటూ ఆశ్చర్యపోతూ సరదాగా కామెంట్లు పెడుతున్నారు.
Read more: