అందం పెంచుకోవడానికి ఆ పని చేసిన తప్పేలేదంటున్న మెగా హీరో బ్యూటీ!

ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న నటి మానుషీ చిల్లర్ గురించి సుపరిచితమే.

Update: 2024-02-11 14:41 GMT

దిశ, సినిమా: ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న నటి మానుషీ చిల్లర్ గురించి సుపరిచితమే. నాజూకైన నడుముతో, అందంతో 2017 లో విశ్వసుందరిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ‘ఆపరేషన్ వాలంటైన్’ చిత్రంలో నటిస్తుంది. అలాగే బాలీవుడ్‌లో పలు చిత్రాలతో మానుషీ చిల్లర్ ఫుల్ బిజీగా ఉంది. ఇక ఈ అమ్మడు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. కుర్రాళ్లకు మతిపోగొట్టే హాట్ ఫొటోలను షేర్ చేస్తుంటుంది.

అయితే ఈ హీరోయిన్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరవ్వగా.. సినిమాల విషయాలు పక్కన పెట్టి, మానుషీ చిల్లర్‌ను బ్యూటీకి సంబంధించిన ప్రశ్నలు ఎక్కువగా అడిగారు. ఈ క్రమంలో మానుషీ ఓ ప్రశ్నకు షాకింగ్ ఆన్సర్ చెప్పింది. ‘‘బ్యూటిఫుల్ గా కనిపించేందుకు ఎంతో మంది సెలబ్రిటీలు అనేక ప్రయత్నాలు చేస్తారు కదా? కొంతమందైతే రిస్క్ చేసి మరీ ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుని.. చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకున్న సంఘటనలు చూశాం. ఈ దారిలో వెళ్లడం సరైనదేనా? అని మానుషీ చిల్లర్‌ను ప్రశ్నించారు.

దీనికి ఈ హీరోయిన్ బదులిస్తూ.. ‘అందం పెంచుకోవడం కోసం ఇలాంటి ప్రయత్నాలు చేయడంలో అసలు తప్పే లేదు. మన దేశ చరిత్రను చూసినట్లైతే.. కొన్ని వేల సంవత్సరాల క్రితం సౌందర్య నిపుణులు ఉన్నట్లు మనకు శాస్త్రాల ద్వారా అర్థమవుతోంది. దీన్ని బట్టి చూస్తే బ్యూటీ కోసం చేసే ప్రయత్నాలు ఇప్పుడు కొత్తేమీ కాదు. అలాగే ఒక్కొక్కరు ఒక్కోలా తమ బాడీని చూపించుకునేందుకు ఇష్టపడతారు. సో బాడీని సర్జరీ చేయించుకుంటే తప్పేంటి? పైగా అది వారి వ్యక్తిగత విషయం’’ అంటూ మానుషీ చిల్లర్ చెప్పుకొచ్చింది.


Similar News