లెక్చరర్ ఒంటరిగా రూంలోకి రమ్మన్నాడు.. నాని హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

‘నచ్చావులే’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ మాధవీలత.

Update: 2024-02-04 15:33 GMT

దిశ, సినిమా: ‘నచ్చావులే’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ మాధవీలత. మొదటి మూవీతోనే ఫుల్ క్రేజ్ దక్కించుకున్న ఈ అమ్మడు తర్వాత ఆడదపడద సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. కానీ పెద్దగా విజయం సాధించలేకపోయింది. తర్వాత ఈ భామకు అవకాశాలు మొత్తమే కనుమరుగైపోయాయి. ప్రస్తుతం ఈ అమ్మడు వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది. సినిమాలకు దూరమైనప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం నిత్యం యాక్టివ్‌గా ఉంటుంది. రీసెంట్‌గా మాధవీలత ఓ ఇంటర్వ్యూకు హాజరై తన జీవితంలో ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ గురించి చెప్పుకొచ్చింది.

‘‘నేను డ్రామా నేర్చుకుంటున్న సమయంలో ఓ లెక్చరర్ నన్ను ఒంటరిగా తన గదిలోకి రమ్మన్నాడు. ఆ సార్ అలా అన్నాక నేను ఒక్కసారిగా షాక్ అయ్యాను. అలాగే ఓ షాపింగ్ మాల్ కు వెళ్లినప్పుడు మా నాన్న వయస్సున్న ఓ వ్యక్తి నన్ను తాకుతూ అసభ్యకరంగా ప్రవర్తించాడు. యూత్ కన్నా తండ్రి ఏజ్ ఉన్నవారే ఆడవారి పట్ల లిమిట్స్ దాటి ప్రవర్తిస్తారు. యూత్.. గర్ల్స్ ఏమన్నా అంటారని వెనకముందు ఆలోచిస్తారు. కానీ అంకుల్స్ అలా కాదు. మళ్లీ తెలివిగా తప్పించుకోలరు. అంటూ హీరోయిన్ మాధవీలత చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.


Similar News