పెళ్లికి ముందు ఆయనతో ఎఫైర్.. సంచలన నిజం బయటపెట్టిన లావణ్య త్రిపాఠి!
టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రస్తుతం ఓ వైపు మ్యారేజ్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తూనే మరోవైపు సినిమాలు, వెబ్ సిరీస్ లతో దూసుకుపోతుంది.
దిశ, సినిమా: టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రస్తుతం ఓ వైపు మ్యారేజ్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తూనే మరోవైపు సినిమాలు, వెబ్ సిరీస్ లతో దూసుకుపోతుంది. ఇటీవల ఈ అమ్మడు నటించిన ‘మిస్ పర్ఫెక్ట్’ వెబ్ సిరీస్ ఫిబ్రవరి 2 వ తేదీన డిస్నీ + హాట్ స్టార్‌లో విడుదలై మంచి రెస్పాన్స్ దక్కుతుంది. లావణ్యకు సినిమా అవకాశాలు కూడా జోరుగా వస్తు్న్నాయని సమాచారం.
ఇక మిస్టర్ సినిమా షూటింగ్ సమయంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌తో ప్రేమలో పడి.. గత ఏడాది వివాహం చేసుకుని మెగా ఫ్యామిలీలో కోడలిగా అడుగుపెట్టింది. కాగా హద్దులు చేరిపేయకుండా మెగా ఫ్యామిలీని పరువు, మర్యాదలు మదిలో పెట్టుకుని సినిమాల్లో నటిస్తానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. తాజా ఇంటర్వ్యూలో లావణ్య త్రిపాఠి పెళ్లికి ముందు తన లవ్ ఎఫైర్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ‘‘సినీ ఇండస్ట్రీ అంటే ఒకరిని లవ్ చేస్తారు. బోర్ కొట్టగానే మరోకరితో లవ్ లో పడతారు. మరొకరిని పెళ్లి చేసుకుంటారని సాధారణంగా అందరూ ఇలాగే అనుకుంటారు.
సోషల్ మీడియాలో లెక్కలేనన్ని పుకార్లు సృష్టిస్తారు. కానీ అవన్నీ అవాస్తవాలు. సెలబ్రిటీల జీవితం అందరూ అనుకున్నట్లుగా ఉండదు. నేను సినీ పరిశ్రమకు వచ్చి అన్నేళ్లైన ఏ వ్యక్తితో ప్రేమలో పడలేదు. మిస్టర్ సినిమా షూటింగ్ సమయంలో వరుణ్ తేజ్‌తో ఫస్ట్ స్నేహం ఏర్పడింది. తర్వాత ప్రేమలో పడ్డాం. షూటింగ్ ఎండింగ్ లో వరుణ్ నాకు గులాబీ పువ్వు ఇచ్చి ప్రపోజ్ చేశాడు’’. అంటూ లొట్టచెంపల ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ అమ్మడు కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.