తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న హీరోయిన్ ఇలియానా..
గోవా బ్యూటీ ఇలియానా రామ్ పోతినేని 'దేవదాస్' సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది..
దిశ, వెబ్ డెస్క్: గోవా బ్యూటీ ఇలియానా రామ్ పోతినేని 'దేవదాస్' సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మహేష్ బాబు, పవన్ కల్యాణ్, అల్లు అర్జున్ వంటి స్టార్స్‌తో నటించి తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం బాలీవుడ్లో సినిమాలు చేస్తూ టాలీవుడ్‌కు కాస్త దూరంగా ఉంది. తాజాగా, ఇలియానా ఆసుపత్రిలో జాయినట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపింది. తన ఇన్‌స్టా స్టోరీలో ఓ ఫొటోను షేర్ చేస్తూ ఓ పోస్ట్ పెట్టింది. ''నేను గత మూడు రోజులుగా అనారోగ్యం బారినపడ్డాను. అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో జాయిన్ అయ్యాను. కనీసం ఆహారం తీసుకోలేని స్థితిలో ఉన్నాను. డాక్టర్లు 3 బాటిళ్ల సెలైన్స్ ఎక్కిస్తున్నారంటూ'' చెప్పుకొచ్చింది. దీంతో అభిమానులు తీవ్ర ఆందోళనలో పడి కామెంట్లు చేశారు. అభిమానులు కామెంట్లు పెట్టడంతో మరో పోస్ట్ కూడా చేసింది. 'నా ఆరోగ్యం గురించి అందరూ మెసేజ్ పెడుతున్నారు. నా మీద ఇంత ప్రేమ చూపిస్తుంటే చాలా సంతోషంగా ఉంది. వారి ప్రార్ధనల వల్ల నేను ప్రస్తుతం అనారోగ్యం నుండి కోలుకున్నాను అంటూ చెప్పింది.