Allu Arjun : భార్య అల్లు స్నేహ కంటే క్యూట్‌గా బన్నీని ఇంప్రెస్ చేసిన హీరోయిన్.. నెటిజన్ల రియాక్షన్ ఇదే..
దిశ, సినిమా : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో అతనికి ఉన్న క్రేజ్ ఎలాంటిదో తెలిసిందే. కాగా నేడు (సోమవారం) తన 42వ పుట్టిన రోజును కుటుంబంతో కలిసి గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నాడు బన్నీ. ఈ సందర్భంగా అతని భార్య అల్లు స్నేహ రెడ్డి స్పెషల్‌గా విష్ చేసింది. అంతేకాకుండా ‘హ్యాపీ బర్త్ డే క్యూటీ’ అంటూ తన ఇన్‌స్టా స్టోరీలోనూ ఎంతో క్యూట్‌గా విష్‌చేసి ఆకట్టుకుంది. ఇది చూసిన బన్నీ అభిమానులంతా ‘ఎంత బాగా విష్ చేశారో.. భార్య అంటే అదే మరి’ అంటూ పొగిడేస్తున్నారు.
కాగా ఇంతలోనే అల్లు అర్జున్‌కు బర్త్ డే విషెస్ తెలిపే మరో పోస్ట్ సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. పైగా ఇది నెటిజన్లను బాగా ఆకట్టుకుంది. అది చూసిన పలువురు ‘అల్లు అర్జున్ భార్యకంటే మీరే ఆయనను క్యూట్‌గా విష్ చేశారు’ అంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే నెటిజన్లు భార్యకంటే ఎక్కువగా బన్నీని ఇంప్రెస్ చేసిందంటున్న ఆమె ఎవరో కాదు. టాలీవుడ్ హీరోయిన్ హన్సికా మోత్వానీ. ‘హ్యాపీ బర్త్ డే అల్లు అర్జున్’ అంటూ క్యూట్‌గా విష్ చేసిన హన్సికా ‘మీరు నాకు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికీ ఫేవరెట్. ఈ ఇయర్ మొత్తం మరింత మంచి జరగాలని ఆశిస్తున్న’ అంటూ రాసుకొచ్చింది. దీనికి బన్నీ స్పందిస్తూ ‘థాంక్ యూ హన్సు’ అంటూ అంతే క్యూట్‌గా రిప్లయ్ ఇవ్వగా ఇటు అల్లు అర్జున్ అభిమానులను, అటు నెటిజన్లను ఈ పోస్ట్ బాగా ఆకట్టుకుంది. ఇక హన్సికా, అల్లు అర్జున్ ‘దేశ ముదురు’ సినిమాలో కలిసి నటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య స్నేహం అదే లెవల్లో కొనసాగుతోంది.