పెళ్లైన 16 రోజులకే.. అక్కడ యాసిడ్ పోస్తానన్నాడు: స్టార్ హీరోయిన్ సంచలన కామెంట్స్

సీరియల్స్, సినిమాల్లో కలిసి నటించిన నటీనటులు మధ్య పరిచయాలు.. ఫస్ట్ స్నేహం తర్వాత ప్రేమగా మారి.. అది కాస్త పెళ్లి వరకు తీసుకెళ్తోంది.

Update: 2024-05-14 15:14 GMT

దిశ, వెబ్‌డెస్క్: సీరియల్స్, సినిమాల్లో కలిసి నటించిన నటీనటులు మధ్య పరిచయాలు.. ఫస్ట్ స్నేహం తర్వాత ప్రేమగా మారి.. అది కాస్త పెళ్లి వరకు తీసుకెళ్తోంది. అయితే కొంతమంది ఆదర్శదంపతులుగా నిలిచినట్లైతే మరికొంతమంది వివాహాలు మున్నాళ్ల ముచ్చటగా మిగిలిపోతున్నాయి. చిన్న గొడవలతో.. మనస్పర్థల కారణంగా డివోర్స్ వరకు వెళ్తున్నారు. పిల్లలున్నారనన్న విషయం కూడా మర్చిపోయి క్షణికాశంలో కోర్టుకెక్కుతున్నారు. అలాంటి వారిలో నోయన్ సీన్-ఎస్తర్ కపుల్ ఒకటి. హీరోయిన్ ఎస్తర్ 1000 అబద్ధాలు, భీమవరం బుల్లోడు, గరం, జయ జానకి నాయక వంటి చిత్రాల్లో నటించి టాలీవుడ్ ప్రేక్షకుల వద్ద మంచి మార్కులు కొట్టేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌ల్లో కూడా నటిస్తుంది. ఇకపోతే ఎస్తర్.. యాక్టర్ కమ్ సింగర్ నోయల్‌తో ప్రేమలో పడి వివాహం చేసుకున్న విషయం తెలిసింతే.

కానీ వీరి బంధం ఎక్కువ కాలం నిలవలేకపోయింది. తాజాగా ఎస్తర్ ఓ ఇంటర్వ్యూకు హాజరై షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘‘నోయల్ నాతో విడిపోయాక నాపై చెడు ప్రచారం చేస్తూ వచ్చాడు. బిగ్ బాస్ హౌస్‌లో జనాలు అతడిపై సింపతి చూపించేలా మా డివోర్స్ ఇష్యూను తీసుకొచ్చాడు. ప్రేక్షకుల్లో సానుభూతి పొందాడు. దీంతో జనాలంతా నాదే తప్పు అని భావించి.. నాపై చాలామంది దారుణమైన ట్రోల్స్ చేశారు. ఓ పర్సన్ ఎవరో తెలియదు కానీ హైదరాబాదు వస్తే అక్కడ యాసిడ్ పోస్తానని బెదిరిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. కానీ మా మధ్య ఏం జరిగిందో నాకు తెలుసు. పెళ్లైన 16 రోజులకే గొడవలు స్టార్ట్ అయ్యాయి. టార్చర్ అనుభవించా’’ అంటూ ఎస్తర్ చెప్పుకొచ్చింది. 

Tags:    

Similar News