ఆ వ్యక్తితో డేటింగ్ చేశా.. ఇప్పుడు డివోర్స్డ్ ఇండస్ట్రీ వ్యక్తితో ఆ స్టార్ హీరోయిన్ పెళ్లి.. నోరెళ్లబెడుతోన్న జనాలు?
టాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేసినప్పటికీ.. తనకంటూ సొంత ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది హీరోయిన్ అంజలి.
దిశ, సినిమా: టాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేసినప్పటికీ.. తనకంటూ సొంత ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది హీరోయిన్ అంజలి. ఈ అమ్మడు తెలుగు సినిమాల్లో కన్నా.. తమిళ చిత్రాల ద్వారానే ఎక్కువగా ఫేమస్ అయ్యింది. అతి తక్కువ సమయంలోనే కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన కరతు తమిళ్ మూవీతో తమిళ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. అంజలి నటనతో కోలీవుడ్ ప్రేక్షకులను కట్టిపడేసింది. దీంతో ఈ బ్యూటీకి వరుస అవకాశాలు క్యూ కట్టాయి.
ఇక తెలుగులో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో సీత పాత్రలో నటించి ఆడియన్స్ ను అలరించింది. తర్వాత జర్నీ సినిమాలో నటించి.. హీరో జైతో లవ్ లో పడిందని.. త్వరలో వీరు పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు నెట్టింట వార్తలు వచ్చాయి. కానీ వారిద్దరు జస్ట్ ఫ్రెండ్స్ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పి ఈ పుకార్లకు చెక్ పెట్టింది. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ఎప్పుడు ఓపెన్ అవ్వని అంజలి.. ఓ వ్యక్తితో రిలేషన్ షిప్ లో ఉండటం వల్లే కెరీర్ పై కాన్సన్స్ట్రేషన్ చేయలేకపోతున్నానని, రాంగ్ రిలేషన్ షిప్ అని చెప్పి.. ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చింది. రిలేషన్ షిప్ కన్నా మన కెరీర్ కు ప్రాధాన్యత ఇవ్వడం ముఖ్యమని తెలిపింది.
ఇకపోతే తాజాగా ఈ హీరోయిన్ గురించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. అంజలి ఓ తెలుగు నిర్మాతతో గత సంవత్సరం నుంచి డేటింగ్ చేస్తుందని, మరికొన్ని రోజుల్లో వీరిద్దరు ఏడడుగుల బంధంతో ఒక్కటవ్వనున్నారని నెట్టింట తెగ చర్చించుకుంటున్నారు. ఆ నిర్మాతకు ఆల్రెడీ ఓ పెళ్లై.. డివోర్స కూడా అయ్యాయట. దీంతో పలువురు నెటిజన్లు అంజలి విడాకులు తీసుకున్న హీరోను పెళ్లి చేసుకోవాల్సిన అవసరమేముంది అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ వార్తలో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచింది.