హీరో విశాల్ ఆరోపణలు.. కేసు నమోదు చేసిన సీబీఐ
ముంబై సెన్సార్ బోర్డుపై హీరో విశాల్ ఆరోపణలపై సీబీఐ స్పందించింది.
దిశ, వెబ్‌డెస్క్: ముంబై సెన్సార్ బోర్డుపై హీరో విశాల్ ఆరోపణలపై సీబీఐ స్పందించింది. తాజాగా సీబీఐ ఈ అంశంలో కేసు నమోదు చేసింది. ముంబై సెన్సార్ బోర్డుతో పాటు మధ్యవర్తులుగా వ్యహరించిన ముగ్గురిపై సీబీఐ కేసు నమోదు చేసింది. కాగా హీరో విశాల్ ‘మార్క్ ఆంటోని’ సినిమా హిందీ వెర్షన్ కోసం తాను చెల్లించానని ఇటీవల సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. సెన్సార్ బోర్డుకు రూ.7లక్షలు లంచం ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు డబ్బు పంపిన అకౌంట్ నెంబర్ల స్ర్కీన్ షాట్లను తన పోస్ట్‌కు జత చేశారు.