హీరో తరుణ్ కెరీర్ నాశనం కావడానికి తన తల్లే కారణం.. అందుకే ఫెయిల్ అయ్యానంటూ ఓపెన్ కామెంట్స్

టాలీవుడ్ హీరో తరుణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.

Update: 2024-07-04 07:02 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో తరుణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఎక్కువగా ప్రేమ కథా చిత్రాల్లో నటించి లవర్ బాయ్ బిరుదు తెచ్చుకున్నాడు. ఇప్పటికీ అతనికి సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పడంలో అతియోశక్తి లేదు. కానీ గత కాలంగా పూర్తిగా ఇండస్ట్రీకి దూరం అయ్యాడు. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉండట్లేడు. మొత్తానికి కనిపించకుండా పోయాడు. అయితే తరుణ్ కెరీర్ నాశనం కావడానికి తన తల్లి రోజా రమణినే కారణం అని.. ఆమె నిర్ణయాలే తరుణ్‌ని పాతాళానికి పడేశాయని కొందరు విమర్శించారు. అయితే తాజాగా వీటిపై హీరో తరుణ్ స్పందించారు.

ఆయన మాట్లాడుతూ.. తన కెరీర్ నాశనం కావడానికి తల్లి రోజా రమణి ఏ విధంగా కూడా కారణం కాదు. ఎందుకంటే నేను స్క్రిప్ట్ విషయంలో నా ఫ్యామిలీతో డిస్‌కస్ చేసేవాడిని కానీ ఫైనల్ డెసిషన్ మాత్రం నాదే అని చెప్పారు. అలాగే ‘నువ్వే కావాలి’ సినిమా చూశాక ఆడియన్స్ నా నుండి అదే స్థాయి చిత్రాలు ఆశించారు. అందుకే వరుస పరాజయాలు ఎదురయ్యాయని చెప్పుకొచ్చారు తరుణ్. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది.


Similar News