సినిమాలకు గుడ్ బై చెప్పనున్న హీరో Srikanth?
టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఫ్యామిలీ హీరోగా ఈయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఈ మధ్యకాలంలో విలన్ పాత్రలు చేస్తూ తన నటనతో ప్రేక్షకులను భయపెడుతున్నాడు
దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఫ్యామిలీ హీరోగా ఈయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఈ మధ్యకాలంలో విలన్ పాత్రలు చేస్తూ తన నటనతో ప్రేక్షకులను భయపెడుతున్నాడు అనడంలో సందేహం లేదు. అంటే అంతలా తన నటనా విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు. ప్రస్తుతం వరస సినిమాల్లో నటిస్తున్న ఈ హీరో త్వరలో సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నాడంటూ ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అయితే దీనికి కారణం లేకపోలేదు.
అసలు విషయంలోకి వెళ్లితే.. రీసెంట్‌గా జరిగిన ఆషాడం బోనాల ఉత్సవాల కార్యక్రమంలో బీజేపీ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ తో కలిసి హీరో శ్రీకాంత్ కనిపించారు. ఆయనతో పాటే అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట చాలా వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలను చూసిన ప్రతి ఒక్కరు శ్రీకాంత్ సినిమాలకు గుడ్ బై చెప్పి, పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడా అంటూ ముచ్చటిస్తున్నారు. అయితే దీనిపై క్లారిటీ రావాలంటే శ్రీకాంత్ స్పందించాల్సిందే అంటున్నారు తమ అభిమానులు.
Also Read: 5 సంవత్సరాలుగా మందుకు బానిసైన Hyper Aadi.. కారణం ఆ అమ్మాయేనా?