టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ముగ్గురు స్టార్ హీరోయిన్లతో 8 ఏళ్లు లవ్ ఎఫైర్.. సందీప్ కిషన్ సంచనల కామెంట్స్
డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు హీరో సందీప్ కిషన్.
దిశ, సినిమా: డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు హీరో సందీప్ కిషన్. ఈ హీరో ఆనంద్ దర్శకత్వంలో ‘ఊరు పేరు భైరవ కోన’ అనే సినిమాలో నటించాడు. ఈ సినిమా ఫిబ్రవరి 16 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ అవ్వనుంది. ఇందులో రీసెంట్‌గా తెరకెక్కిన రవితేజ ‘ఈగల్’ చిత్రంలో నటించిన క్రేజీ హీరోయిన్ కావ్య థాపర్ కథానాయికగా నటిస్తోంది.
ఇకపోతే సందీప్ కిషన్ తాజాగా ‘‘ఊరు పేరు భైరవ కోన’ సినిమా ప్రమోషన్స్ పాల్గొని తన ప్రేమ గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపెట్టాడు. ‘సందీప్ టాలీవుడ్ చెందిన ముగ్గురు అమ్మాయిలను ప్రేమించానని తెలిపాడు. ఒక అమ్మాయితో నాలుగేళ్లు లవ్ లో ఉన్నానని.. మరో ఇద్దరు అమ్మాయితో రెండేళ్లు లవ్‌లో ఉన్నానని తెలిపాడు. సీరియస్‌గా లవ్ చేశానని.. కానీ ఒక్క అమ్మాయితో లవ్ వర్కౌట్ కాలేదని చెప్పాడు. ప్రస్తుతం నేను ఉన్న పొజిషన్ చూస్తే.. లవ్ అసలు ఇంపార్టెంట్ కాదని పేర్కొన్నాడు.
ఆ హీరోయిన్లతో అన్నేళ్లు లవ్ లో ఉన్నా.. ఎవరికీ తెలియకుండా సీక్రెట్ గా ఉంచానని అన్నాడు. సందీప్ కిషన్ కు, రెజీనాకు మధ్య రిలేషన్ అప్పట్లో సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి. కానీ అవన్నీ పుకార్లు. అందులో ఎటువంటి నిజం లేదని తెలిపాడు. హీరో సందీప్ కిషన్ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ హీరో ‘ఊరు పేరు భైరవ కోన’ సినిమా కోసం సందీప్ కిషన్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.