సెల్ఫీకి ప్రయత్నించిన వ్యక్తిని నెట్టేసిన హీరో రామ్ చరణ్..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా హాజరయ్యారు.
దిశ, సినిమా: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా హాజరయ్యారు. ఇదే కార్యక్రమంలో తన బాబాయ్ పవన్ కళ్యాణ్ కూడా తొలిసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వేడుకలో RRR స్టార్ రామ్ చరణ్, తన తండ్రి మెగా స్టార్ చిరంజీవి , తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌తో కలిసి పాల్గొన్నారు.
అయితే ఈ సందర్భంగా రామ్ చరణ్ వస్తుండగా ఆయనతో సెల్ఫీ దిగేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించారు. అయితే అతన్ని తెలుగు స్టార్ రామ్ చరణ్ పక్కకు నెట్టాడు. వెంటనే అతన్ని రామ్ భద్రతా బృందం దూరం చేసింది. మరొక వ్యక్తి కూడా రామ్‌తో ఫోటో తీయడానికి ప్రయత్నించాడు. కానీ ఆయన సెక్యూరిటీ బృందం అతనిని అడ్డుకుంది. X లో షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.