పుట్టబోయే బిడ్డ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన యంగ్ హీరో.. భార్య సీమంతం పోస్ట్ వైరల్

‘కార్తికేయ, స్పై, 18 పేజెస్’ వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకుల వద్ద మంచి మార్కులు కొట్టేశాడు యంగ్ హీరో నిఖిల్.

Update: 2024-02-01 06:53 GMT

దిశ, సినిమా: ‘కార్తికేయ, స్పై, 18 పేజెస్’ వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకుల వద్ద మంచి మార్కులు కొట్టేశాడు యంగ్ హీరో నిఖిల్. విభిన్న కథలను ఎంపిక చేసుకుంటూ.. తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందుతున్నాడు. ప్రస్తుతం ఈ హీరో స్వయంభు, ది ఇండియా హౌజ్, చైనా పీస్ వంటి క్రేజీ ప్రాజెక్ట్‌లో నటిస్తున్నారు. తాజాగా నిఖిల్ తనకు పుట్టబోయే బిడ్డపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.

‘‘మా ఫస్ట్ బేబీ త్వరలోనే మా ముందుకు రానుంది. ఈ విషయంలో నా భార్య పల్లవి.. నేను చాలా హ్యాపీగా ఉన్నాం. మాకు మీ అందరి ఆశీస్సులు కావాలి. అంటూ నిఖిల్.. తన భార్య సీమంతం ఫొటో సోషల్ మీడియాలో పంచుకుంటూ క్యాప్షన్ రాసుకొచ్చాడు. దీంతో ఫ్యాన్స్.. మీ బేబీ రాకతో మీ జీవితంలో మరింత నవ్వులు పూయాలని, కెరీర్ పరంగా సక్సెస్ అందుకోవాలని కోరుకుంటున్నాం అంటూ నిఖిల్ కు విషెష్ తెలియజేస్తున్నారు.


Similar News