సుమను తన కోరిక తీర్చమని అడిగిన స్టార్ హీరో.. దెబ్బకు స్టార్ యాంకర్ మైండ్ బ్లాక్!
హీరో కార్తికేయ తన తాజా చిత్రం ‘భజే వాయు వేగం’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా సుమ అడ్డా షోకు హాజరయ్యాడు.
దిశ, వెబ్‌డెస్క్: హీరో కార్తికేయ తన తాజా చిత్రం ‘భజే వాయు వేగం’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా సుమ అడ్డా షోకు హాజరయ్యాడు. హీరోతో పాటు ఈ చిత్ర హీరోయిన్ ఐశ్వర్య మీనన్, డైరెక్టర్ ప్రశాంత్ కూడా హాజరయ్యారు. ఈ షో లో హీరో కార్తికేయ యాంకర్ సుమకు చుక్కలు చూపించాడు. టైమింగ్ పంచులతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. ఐపీఎల్ అంటే ఏం గుర్తొస్తుందో చెప్పాలని సుమ అడగ్గా.. ఈ ప్రశ్నకు కార్తికేయ.. యాంటీ మేకప్ ఫోర్స్, తెలుగు భాషలో నాకు నచ్చని పదం అంటే మేకప్ ని కార్తికేయ చెప్పాడు. దీంతో సుమ అది తెలుగు పదం కాదని పంచ్ వేసింది. ఇక ఐశ్వర్యను ఉద్దేశిస్తూ మేకప్ ఆమె వేసుకోవడం కాదు, మేకప్ ఆమెను వేసుకుందని అంటాడు. దీంతో హీరోయిన్ గట్టిగా నవ్వేస్తుంది. తర్వాత సుమ షోలో అందరికీ జ్యూస్ ఇచ్చింది. ఇది తాగితే ఏమవుతుందని కార్తికేయ, సుమను అడుగుతారు. మనసులో ఉన్న కోరిక నెరవేరుతుందని సుమ చెబుతుంది. తర్వాత సుమను నా సినిమా ప్రొడ్యూస్ చేయాలని కార్తికేయ అడుగుతారు. దీంతో సుమ ఒక్కసారిగా బిత్తర ముఖం వేస్తుంది. ఎందుకు సుమగారు అలా షాక్ అయ్యారు. మీరు నా సినిమాను ప్రొడ్యూస్ చేయాలని నా కోరిక అని అంటాడు. ఇకపోతే సుమ తన కుమారుడు రోషన్ చిత్రానికి ప్రొడ్యూస్ చేయబోతుందని టాక్ వినిపిస్తుంది. దీంతో కార్తికేయ కూడా తన సినిమాను నిర్మించాలని చెప్పాడని, మరీ కార్తికేయ కోరిక తీరుతుందో చూడాలంటూ నెట్టింట జనాలు కామెంట్లు చేస్తున్నారు.