Hero Karthi: స్టేజి పై తెలుగు పాట పాడిన హీరో కార్తీ
కార్తీ వెంటనే ఈ మూవీ 90s మూవీలా ఉంటుంది కాబట్టి అలాంటి సాంగ్ పాడతా అని తెలుగులో బాగా పాడారు.
దిశ, వెబ్ డెస్క్ : తమిళ్ స్టార్ హీరో కార్తీ హీరోగా నటించిన మూవీ సత్యం సుందరం. ఈ మూవీ సెప్టెంబర్ 28న ఆడియెన్స్ ముందుకు రానుంది. తాజాగా హైద్రాబాద్ లో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. అయితే, ఈ స్టేజిపై హీరో కార్తీ పాత సినిమాలోని తెలుగు పాట పాడారు. యాంకర్.. సరదాగా ఓ పాట పాడండని అడగగా.. కార్తీ వెంటనే ఈ మూవీ 90s మూవీలా ఉంటుంది కాబట్టి అలాంటి సాంగ్ పాడతా అని తెలుగులో బాగా పాడారు.
కార్తీ ‘అభినందన’ అనే పాత మూవీలోని .. అదే నీవు.. అదే నేను.. అదే గీతం.. పాటను చక్కగా పాడారు. దీంతో ఈ సాంగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇది చూసిన తెలుగు ఫ్యాన్స్ మీరు తెలుగు బాగా నేర్చుకున్నారని అర్ధమవుతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
అంతక ముందు కార్తీ సింగర్ గా తమిళ్ లో కొన్ని సార్లు పాటలు పాడారు. తెలుగులో శర్వానంద్ హీరోగా నటించిన ఒకే ఒక జీవితం మూవీలో ఒక సాంగ్, తర్వాత జపాన్ మూవీలో ఒక పాట పాడారు.