Hema: తప్పకుండా రెండో పెళ్లి చేసుకుంటా.. హేమ షాకింగ్ స్టేట్‌మెంట్!

టాలీవుడ్ సీనియర్ నటి హేమ అందరికీ సుపరిచితమే. ఆమె దాదాపు 250కి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది.

Update: 2024-08-21 07:52 GMT
Hema: తప్పకుండా రెండో పెళ్లి చేసుకుంటా.. హేమ షాకింగ్ స్టేట్‌మెంట్!
  • whatsapp icon

Full View

(Video Link Credits to Suman TV youtube Channel)

దిశ, సినిమా: టాలీవుడ్ సీనియర్ నటి హేమ అందరికీ సుపరిచితమే. ఆమె దాదాపు 250కి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. టాలీవుడ్ స్టార్ హీరోలందరితో నటించిన ఆమె గత కొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది. అయినప్పటికీ గత మూడు నెలల నుంచి హేమ పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతున్న విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన బెంగళూరు రేవ్ పార్టీకి వెళ్లి ఆమె డ్రగ్స్ తీసుకున్నట్లు వార్తలు రావడంతో అంతా షాక్‌కు గురయ్యారు. ఈ క్రమంలోనే హేమ బర్త్ డే పార్టీ‌కి వెళ్లాను అని.. ఒక సారి హైదరాబాద్‌లో మామిడి తోటలో ఉన్నట్లు పలు వీడియోలు షేర్ చేసి హైడ్రామా చేసింది. ఇక దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారించి నోటీసులు పంపించారు.

అంతేకాకుండా విచారణ పేరుతో ఆమెను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఒక కొద్ది రోజులు అక్కడే ఉన్న మేమ ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చింది. ఇక అప్పటి నుంచి వరుస ఇంటర్వ్యూలో పాల్గొంటూ తాను తప్పు చేయలేదు డ్రగ్స్ తీసుకోలేదు నేను బహిరంగంగా ఎలాంటి టెస్ట్ చేయించుకోవడానికి రెడీగా ఉన్నాను అని చెప్తూ సంచలనం సృష్టిస్తోంది. ఈ క్రమంలో.. తాజాగా, ఓ చానల్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హేమ రెండో పెళ్లిపై షాకింగ్ స్టేట్‌మెంట్ ఇచ్చింది. అయితే ఇందులో యాంకర్ రోషన్ డ్రగ్స్ తీసుకున్నట్లు ఎన్నో వార్తలు వచ్చాయి అప్పుడు మీ భర్త ఏమన్నారు మీరు అసలు కలిసే ఉంటున్నారా అని అడగ్గా.. ‘‘ మేము కలిసే ఉంటున్నాము.

ఒకవేళ విడాకులు తీసుకుంటే నీకు చెప్పే తీసుకుంటాంలే. మళ్లీ నాకు ఓ సంబంధం చూద్దువు కానీ అని అంటుంది. దానికి రోషన్ మళ్లీ రెండో పెళ్లి చేసుకుంటావా? అని అడగటంతో.. ఏ ఎందుకు చేసుకోకూడదు నాకేం తక్కువ నేను మా ఆయనతో విడిపోతే కచ్చితంగా రెండో పెళ్లి చేసుకుంటా. కానీ మా ఆయనతో అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి విడిపోను. ఆయన నాకు విడాకులు ఇవ్వరు అని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా రేవ్ పార్టీ వల్ల ఇవన్నీ రూమర్స్ క్రియేట్ చేసి కొంతమంది నా జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నారు అని పలు విషయాలు చెబుతూ ఏడ్చేసింది. ప్రజెంట్ హేమ రెండో పెళ్లిపై చేసిన స్టేట్‌మెంట్ అందరినీ షాక్‌కు గురి చేస్తుంది.

Tags:    

Similar News