ఒకే ఒక్క పాత్రతో రాబోతోన్న హలో మీరా.. సినిమా రిలీజ్ ఎప్పుడంటే..?
ఒకే ఒక్క పాత్రతో రాబోతున్న ‘హలో మీరా’ ఏప్రిల్ 21న రిలీజ్ కాబోతోంది.... Hello Meera Will Be Release On April 21
దిశ, సినిమా: ఒకే ఒక్క పాత్రతో రాబోతున్న ‘హలో మీరా’ ఏప్రిల్ 21న రిలీజ్ కాబోతోంది. ప్రముఖ దర్శకులు బాపు గారి శిష్యుడైన కాకర్ల శ్రీనివాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. లూమియర్ సినిమా బ్యానర్‌పై జీవన్ కాకర్ల సమర్పణలో.. డా. లక్ష్మణరావు దిక్కల, వరప్రసాదరావు దుంపల, పద్మ కాకర్ల ఈ సినిమాను నిర్మించారు. కాగా తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న చిత్రంలో ఎలాంటి అసభ్యకర సన్నివేశాలు లేకపోవడంపై ప్రశంసలు కురిపించారు సెన్సార్ సభ్యులు. సూరి సాధనాల అసోసియేట్ డైరెక్టర్‌గా పని చేసిన మూవీకి ఎస్ చిన్న సంగీతం అందించారు. హిరణ్మయి కల్యాణ్ మాటలు రాయగా.. రాంబాబు మేడికొండ ఎడిటర్‌గా పనిచేశారు.
Also Read..