తిండి లేక కిడ్నీ అమ్ముకోవాలనుకున్నా: ‘కేజీఎఫ్’ మ్యూజిక్ డైరెక్టర్

ఇండస్ర్టీ ఏదైనప్పటికి బ్యాగ్రౌండ్ లేకుండా క్లిక్ అవ్వడం చాలా కష్టం.

Update: 2023-06-04 13:13 GMT

దిశ, సినిమా: ఇండస్ర్టీ ఏదైనప్పటికి బ్యాగ్రౌండ్ లేకుండా క్లిక్ అవ్వడం చాలా కష్టం. అదృష్టంతో క్లిక్ అయినప్పటికీ వారు జీవితంలో చాలా కష్టాలు ఎదుర్కొని ఉంటారు. కాగా తాజాగా సంచలన విజయాలు సొంతం చేసుకున్న కేజీఎఫ్ డైరెక్టర్ రవి బస్రూర్ ఓ ఇంటర్వూలో తన జీవితంలో ఎదుర్కొన్న సినిమా కష్టాల గురించి ఓపెన్ అయ్యాడు. ‘నేను పెద్దగా చదువుకోలేదు. కెరీర్ తొలినాళ్లలో లక్ కూడా కలిసిరాలేదు. టాయిలెట్‌లో కూర్చుని ఏడ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. తినడానికి తిండి లేక, ఇంటి బాధ్యతలు నాపై పడటంతో కిడ్నీ అమ్మడానికి సిద్ధమయ్యాను’ అని చెప్తూ ఎమోషనల్ అయ్యాడు.

Tags:    

Similar News