అస్తమానం డేట్‌కు వెళ్దామని పిలిచేవాడు: హన్సిక కామెంట్స్ వైరల్
చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన హీరోయిన్ హన్సిక 16ఏళ్ల వయస్సులోనే దేశముదురు చిత్రంలో నటించి ప్రేక్షకుల మెప్పు పొందింది.
దిశ, వెబ్‌డెస్క్: చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన హీరోయిన్ హన్సిక.. 16ఏళ్ల వయస్సులోనే దేశముదురు చిత్రంలో నటించి ప్రేక్షకుల మెప్పు పొందింది. తర్వాత ‘మస్కా, బిల్లా, కందిరీగ’ వంటి సినిమాల్లో అలరించింది. ఇటీవల ముంబైకు చెందిన బిజినెస్‌మెన్‌ను ప్రేమ వివాహం చేసుకుని లైఫ్‌ని ఎంజాయ్ చేస్తోంది. కాగా తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని.. షాకింగ్ విషయాలు బయటపెట్టింది. ‘‘ టాలీవుడ్‌లో ఓ స్టార్ హీరో గతంలో నన్ను చాలా వేధించేవాడు. అస్తమానం.. నాతో డేట్‌కు వస్తావా? అంటూ విసిగించేవాడు. అతడికి తగిన బుద్ధి చెప్పాను’’ అని వెల్లడించింది. అయితే ఆ హీరో పేరు మాత్రం హన్సిక బయటపెట్టలేదు.
Read more: