నా లైఫ్‌లో నాకు పెద్ద శత్రువు అతనే.. మోహన్ బాబు నిజస్వరూపం బయటపెట్టిన మంచు లక్ష్మి.!

టాలీవుడ్ స్టార్ హీరో మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Update: 2024-06-22 03:42 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పలు సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే మంచు లక్ష్మి లేటు వయసులో ఇండస్ట్రీకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే హీరోయిన్ అవ్వాలని ఎన్నో కలలు కన్నదట. కానీ తన కలలన్నీ కలలుగానే మిగిలిపోవడానికి ప్రధాన కారణం తన తండ్రే అని, తన తండ్రి తన సినీ జీవితానికి పెద్ద శత్రువు అంటూ రీసెంట్ ఇంటర్వ్యూలో ఒక షాకింగ్ విషయాన్ని బయట పెట్టింది.

మంచు లక్ష్మి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘బిజినెస్ మాన్’ సినిమాలో మహేష్ బాబు ముంబైని ఉచ్చ పోయించడానికి వచ్చినట్టు చెప్పే డైలాగ్ ప్రకారం లాగే నేను కూడా బాలీవుడ్ కి వెళ్ళాలి అనుకున్నాను. కానీ ఆ సమయంలో నా ఫ్యామిలీ అస్సలు సపోర్ట్ చేయలేదు. ముఖ్యంగా నా తండ్రి బాలీవుడ్ కి వెళ్ళడానికి నిరాకరించాడు. ఇక ఆ టైంలో నా ఫ్రెండ్స్ అండ్ దగ్గుబాటి రానా వంటి వాళ్లు నువ్వు బాలీవుడ్ వెళ్ళిపో అని సలహాలు ఇచ్చినప్పటికీ నా తండ్రి మాత్రం నేను వెళ్లడానికి ఒప్పుకోలేదు. ఒకరకంగా నేను పితృ సౌమ్య బాధితురాలిని అంటూ సంచలన కామెంట్స్ చేసింది.

ఇక సౌత్ ఇండస్ట్రీలో చాలామంది హీరోల కూతుర్లను, అక్కాచెల్లెళ్లను సినిమాల్లో హీరోయిన్ గా అసలు అంగీకరించరు. వారిని సినిమాల్లో తీసుకోవడానికి కూడా ఇష్టపడరు. నన్ను సినిమాల్లోకి ప్రకాష్ తీసుకు వచ్చినప్పుడు మా నాన్న ప్రకాష్ వాళ్ళ నాన్న ఒప్పుకోలేదు. వాళ్ళు మా నిర్ణయాన్ని వ్యతిరేకించారు. కానీ పట్టువదలని విక్రమార్కుడిలా నేను సినిమాల్లోకి వచ్చాను. ఇక నా సోదరులు ఇండస్ట్రీలో ఫేమస్ అయినంత త్వరగా నేను ఫేమస్ అవ్వలేకపోయాను. నా స్టార్‌డమ్ కోసం నేను ఇండస్ట్రీలో పోరాడాను అంటూ మంచు లక్ష్మి చెప్పుకొచ్చింది. అలా తన సినీ కెరీర్‌లో తన తండ్రి తనకు పెద్ద శత్రువు అంటూ మంచు లక్ష్మి చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.


Similar News