నా యాక్టింగ్ రోల్ మోడల్ అతనే.. ఇప్పుడు బీస్ట్‌గా అయ్యాడంటూ సమంత ఆసక్తికర కామెంట్స్ (వీడియో)

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గత కొద్ది కాలంగా పూర్తిగా సినిమాలకు దూరమైంది. ఆమె మయోసైటీస్ వ్యాధి బారిన పడటంతో అన్నింటికీ దూరమై ట్రీట్‌మెంట్ తీసుకుంటుంది.

Update: 2024-03-05 05:38 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గత కొద్ది కాలంగా పూర్తిగా సినిమాలకు దూరమైంది. ఆమె మయోసైటీస్ వ్యాధి బారిన పడటంతో అన్నింటికీ దూరమై ట్రీట్‌మెంట్ తీసుకుంటుంది. అయితే ఈ మధ్య వ్యాధి కాస్త తగ్గడంతో సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ పలు పోస్టులు షేర్ చేస్తుంది. అంతేకాకుండా సినీ ఇండస్ట్రీకి కూడా రీ ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఈ భామ మంచి ఆఫర్లు కోసం ఎదురుచూస్తుంది. అప్పటి వరకు ఖాళీగా ఉండకుండా.. పలు యాడ్స్ చేస్తుంది. అలాగే హెల్త్‌కు సంబంధించిన విషయాలను తెలుపుతూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది.

అంతేకాకుండా రోజు రోజు తన అందాన్ని రెట్టింపు చేసుకుంటూ గ్లామర్ ట్రీట్ ఇచ్చి కుర్రాళ్లకు హీట్ పుట్టిస్తోంది. ఇదిలా ఉండగా.. తాజాగా, సామ్ ఓ కాలేజీ ఈవెంట్‌లో భాగంగా ఆసక్తికర కామెంట్స్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఓ స్టూడెంట్ మీకు యాక్టింగ్ రోల్ మోడల్ ఎవరు? అని ప్రశ్నించగా.. దానికి సమంత స్పందిస్తూ.. నా యాక్టింగ్ రోల్ మోడల్ అల్లు అర్జున్. తనతో కలిసి మరో సినిమాలో నటించాలని అనుకుంటున్నాను. ఎందుకంటే తను ఇప్పుడు ఓ యాక్టింగ్ బీస్ట్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యారు’’ అంటూ చెప్పుకొచ్చింది. కాగా, సమంత, అల్లు అర్జున్ జంటగా సన్ ఆఫ్ సత్యమూర్తి మూవీలో నటించి మెప్పించారు. ఆ తర్వాత పుష్ప చిత్రంలోని ఊ అంటావా మావా ఊహూ అంటావా ఐటెం సాంగ్‌లో చిందేశారు.

Read More..

నయనతారతో విడాకులు.. క్లారిటీ ఇస్తూ ఎమోషనల్ వీడియో షేర్ చేసిన విఘ్నేష్ 

Tags:    

Similar News