పవన్ కళ్యాణ్ చిన్న కూతుర్ని చూశారా..? నెట్టింట వైరల్ అవుతున్న క్యూట్ ఫొటోలు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Update: 2024-10-02 05:35 GMT

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బద్రి, జానీ వంటి సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన రేణు దేశాయ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. కాగా వీరికి ఆద్య, అకిరా నందన్ అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. విడాకుల తర్వాత రేణు దేశాయ్ మరో పెళ్లి చేసుకోకుండా తన పిల్లల పూర్తి బాధ్యతలను చూసుకుంటుంది. ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే రేణు దేశాయ్‌తో డివోర్స్ తర్వాత అన్నాలెజినోవా అనే రష్యన్ మహిళను మ్యారేజ్ చేసుకున్నాడు. వీరికీ ఒక పాప, బాబు ఉన్నారు. కాగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు వహిస్తున్నాడు.

ఇదిలా ఉంటే.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, తన ఇద్దరు కూతుళ్లతో కలిసి శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా తన చిన్న కూతురు పలీనా అంజలి కొణిదెల క్రిస్టియన్ కావడంతో టీటీడీ అధికారులు డిక్లరేషన్‌పై సంతకాలు తీసుకున్నారు. ఆమె మైనర్ కావడంతో తండ్రిగా పవన్ కూడా పత్రాలపై సంతకాలు చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే దాదాపు దశాబ్దం తర్వాత పవన్- అన్నా లెజినోవా కూతురు కనిపించడంతో పవన్ అభిమానులు ఆ ఫొటోలను షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు చిన్న కూతురు సేమ్ మా పవన్ అన్నాలా ఉందని, క్యూట్ పిక్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరు పవన్ కళ్యాణ్ చిన్న కూతురిని చూసేయండి.


Similar News