Megastar Chiranjeevi: హ్యాట్స్ ఆఫ్ రితేష్ రాణా.. 'మత్తు వదలరా 2’ పై చిరు ట్వీట్ వైరల్

హ్యాట్స్ ఆఫ్ రితేష్ రాణా

Update: 2024-09-16 04:34 GMT

దిశ, వెబ్ డెస్క్ : 2019 లో వచ్చిన  ‘మత్తు వదలరా’  మూవీ ఎంత పెద్ద విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే.  ఆ మూవీ తోనే సింహా కోడూరి  హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాడు  అయితే ఆ తర్వాత.. వచ్చిన సినిమాలన్నీ  ‘మత్తు వదలరా’ రేంజ్ సక్సెస్ అయితే అందుకోలేదు. రితేష్ రానా  దర్శకత్వంలో వచ్చిన  ఆ సినిమాలో  సత్య కామెడీ హైలెట్ గా నిలిచింది.  5 ఏళ్ళ తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్ గా ‘మత్తు వదలరా 2’  మన ముందుకు వచ్చింది . సెప్టెంబర్ 13న ఆడియెన్స్  ముందుకు వచ్చిన ఈ మూవీ  మొదటి షోతోనే అదిరిపోయే రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. దీంతో ఓపెనింగ్స్ చాలా బాగా వస్తున్నాయి. 

మత్తు వదలరా 2 మూవీ ఫుల్ లెంగ్త్ కామెడీతో ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ మూవీ పై మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. " నిన్ననే ‘మత్తు వదలరా – 2’ మూవీ చూసాను. ఈ మధ్యకాలంలో ఇలాంటి సినిమాని నేను చూడలేదు.. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నవ్వుతూనే ఉన్నాను. సినిమా ఎండ్ టైటిల్స్ కూడా వదలకుండా చూసాను. అంతలా నచ్చేసింది మూవీ. ఈ క్రెడిక్ అంతా దర్శకుడు రితేష్ రాణా కి ఇవ్వాలి. అతను తన రాత , తీత , కోత , మోత, ప్రతీ దాన్ని చక్కగా బ్యాలెన్స్ చేస్తూ ప్రేక్షకులను వినోద పర్చిన విధానాన్ని అభినందించకుండా వుండలేము. హ్యాట్స్ ఆఫ్ రితేష్ రాణా " అంటూ ట్వీట్ లో రాసుకొచ్చారు. అంతే కాకుండా, నటీ నటులు సింహా , ఫారియా అబ్దుల్లా, ప్రత్యేకంగా కమెడియన్ సత్యకు నా అభినందనలు అని తెలియజేశాడు. అలాగే చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు.

Tags:    

Similar News