శంకర్-చెర్రీ మూవీకి రెండు నెలల బ్రేక్.. 'విక్రమ్' ఎంట్రీతో మారిన సీన్!
దిశ, సినిమా : 'ఆర్‌ఆర్‌ఆర్' మూవీ తర్వాత ఓ రేంజ్‌లో దూసుకుపోతున్న మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్..
దిశ, సినిమా : 'ఆర్‌ఆర్‌ఆర్' మూవీ తర్వాత ఓ రేంజ్‌లో దూసుకుపోతున్న మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్.. తన నెక్ట్స్ ప్రాజెక్ట్ కోసం లెజెండరీ డైరెక్టర్ శంకర్‌తో పనిచేస్తున్న సంగతి తెలిసిందే. అయితే కొంతకాలంగా షూటింగ్ జరుపుకుంటున్న #RC15 సినిమాకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. విషయానికొస్తే.. 'విక్రమ్' మూవీతో ఒక్కసారిగా ఫామ్‌లోకి వచ్చిన కమల్ హాసన్ తదుపరి చిత్రం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇదే ఊపులో ఆయన నటిస్తున్న 'ఇండియన్ 2' సినిమాను రిలీజ్ చేస్తే బాగుంటుందని మేకర్స్ భావిస్తున్నారు. మరోవైపు కమల్‌కు వయసు పైబడుతుండటం కూడా ఇందుకు కారణంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే శంకర్ #RC15 చిత్రాన్ని రెండు నెలల పాటు నిలిపేసి 'భారతీయుడు 2' షూటింగ్ పూర్తిచేసే పనిలో ఉన్నాడట. దీంతో రామ్ చరణ్ తన ఫ్యూచర్ ప్రాజెక్టులపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే 'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమా చేసేందుకు సిద్ధమైన చెర్రీ.. ఇందుకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్‌పై ఫోకస్ చేసినట్లుగా ఇండస్ట్రీ వర్గాల టాక్.
సెక్సీ బాంబ్'.. మరింత మత్తుగా బ్యాక్ అందాలు ప్రదర్శించిన ఈషా