Harish Shankar: ఎక్కువ అరిస్తే ట్విట్టర్ లో బ్లాక్ చేస్తా అంటూ.. వార్నింగ్ ఇచ్చిన హ‌రీష్‌ శంక‌ర్‌

అలాగే అరిస్తే నిన్ను ట్విట్ట‌ర్ లో బ్లాక్ చేస్తా.. నీ ఐడీ కూడా నాకు బాగా తెలుసని హ‌రీష్ శంక‌ర్ అన్నాడు

Update: 2024-08-13 11:41 GMT

దిశ, సినిమా : రవితేజ ధమాకా మూవీ సూపర్ హిట్ అవ్వడంతో తన మార్కెట్ అమాంతం పెరిగింది. అంతక ముందు వరకు చాలా నార్మల్ గా ఉండేది. ఈ మూవీ తర్వాత లెక్కలు మొత్తం మారిపోయాయి. సినిమా సినిమాకి మార్కెట్ ను పెంచుకుంటున్నాడు.

మాస్ మ‌హారాజా ర‌వితేజ తాజా సినిమా మిస్ట‌ర్ బ‌చ్చ‌న్‌. హ‌రీష్ శంక‌ర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఫ్యాక్ట‌రీ బ్యానర్ పై టి.జి విశ్వ‌ప్ర‌సాద్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఆగ‌స్టు 15న ఈ మూవీ థియేటర్లో సందడీ చేయనుంది. ఈ క్రమంలోనే మూవీ టీం క‌ర్నూలులో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వ‌హించింది.

ఈ సందర్భంగా డైరెక్టర్ హ‌రీష్ శంక‌ర్ మాట్లాడారు. " త‌ల్లి మనకు ఒకేసారి జ‌న్మ‌నిస్తుంది, కానీ నాకు పున‌ర్జ‌న్మ‌నీ ఇచ్చింది మాత్రం ర‌వితేజ.. ఇక్కడ మీ ముందు ఇలా నిలబడి మాట్లాడుతున్నా అంటే దానికి ప్రధాన కార‌ణం ఆయనే.. చాలా ఏళ్ళు తర్వాత ఆయ‌న‌తో సినిమా చేసేటప్పుడు ఎక్క‌డ దొరకని ప్ర‌శాంత‌త వ‌చ్చింద‌ని అన్నారు. ఇదే సమయంలో ఓ అభిమాని బాగా అరుస్తుండ‌డం చూసి.. అలాగే అరిస్తే నిన్ను ట్విట్ట‌ర్ లో బ్లాక్ చేస్తా.. నీ ఐడీ కూడా నాకు బాగా తెలుసని" హ‌రీష్ శంక‌ర్ అన్నాడు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం నెట్టింట బాగా వైర‌ల్‌ అవుతుంది.

Read More.. 

సక్సెస్ సందర్భంగా నిహారిక రెండో పెళ్లి ప్రకటించనుందా..? వరుడు ఎవరు, పెళ్లి ఎప్పుడంటే? 

Tags:    

Similar News