'పవన్ కళ్యాణ్ సినిమా వల్లే 'హ్యాపీడేస్ అప్పు' సినిమాలు చేయట్లేదా..!!

దిశ,వెబ్‌డెస్క్: సినిమా ఇండస్ట్రీకి ఎంతోమంది నటులు మంచి క్యారెక్టర్స్ తో పరిచయం అవుతుంటారు.. కొందరు అలాగే నిలబడిపోతుంటారు.

Update: 2022-06-13 12:54 GMT

దిశ,వెబ్‌డెస్క్: సినిమా ఇండస్ట్రీకి ఎంతోమంది నటులు మంచి క్యారెక్టర్స్ తో పరిచయం అవుతుంటారు.. కొందరు అలాగే నిలబడిపోతుంటారు. మరికొందరు ఆ గుర్తింపుని నిలబెట్టుకోలేరు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన మూవీ హ్యాపీడేస్ సినిమా ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో నిఖిల్ కు క్లోజ్ ఫ్రెండ్ గా నటించిన గాయత్రి.. పొట్టి జుట్టుతో అప్పు క్యారెక్టెర్ లో అందరినీ ఆకట్టుకుంది. ఆ తరువాత గబ్బర్ సింగ్ సినిమాలో నటించింది. అయితే ఈ సినిమాల్లో నటించినప్పటి నుంచి  సినిమాలు చేయకూడదని నిర్ణయం తీసుకున్నట్లు వాళ్ళ అమ్మ బెంగుళూరు పద్మ  ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. అప్పు సినిమా కెరీర్‌కు సంబంధించి ఆమె కీలక విషయాలు వెల్లడించారు. హరీశ్ శంకర్ డైరెక్షన్ లో  హీరో పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్  సినిమాలో ముందుగా ట్రైయాంగిల్  లవ్ అని చెప్పి తీసుకున్నారని సినిమా రిలీజ్ అయ్యాక ఢిఫరెండ్ టాక్ వచ్చిందన్నారు. అప్పటి నుంచి సినిమాలు తీయటం మానేసి పీజీ పూర్తీ చేసిందన్నారు. ఈ విషయంలో నా కూతురు  మంచి నిర్ణయం తీసుకుందంటూ ఆమె చెప్పుకొచ్చారు. బెంగళూర్ పద్మ కూడా మంచి ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకున్నారు. ఇప్పటికీ తెలుగు సీరియల్స్, సినిమాల్లో నటిగా కొనసాగుతున్నారు.


జిమ్‌లో రెచ్చిపోయిన ఈషా గుప్తా.. చూస్తే మతిపోవాల్సిందే


Similar News