Hanuman producer: రామాయణం ఆధారంగా హనుమాన్‌ నిర్మాత భారీ చిత్రం..

ఓటీటీ పుణ్యమా అని తెలుగు ప్రేక్షకుల అభిరుచి మారింది.. ఆడియన్స్‌ సినిమా చూసే ధోరణిలో మార్పు వచ్చింది.

Update: 2024-07-21 15:39 GMT

దిశ, సినిమా: ఓటీటీ పుణ్యమా అని తెలుగు ప్రేక్షకుల అభిరుచి మారింది.. ఆడియన్స్‌ సినిమా చూసే ధోరణిలో మార్పు వచ్చింది. ఓటీటీని వదిలి థియేటర్‌ వైపు రావాలంటే ఆ సినిమా కంటెంట్‌ ఎంతో స్ట్రాంగ్‌గా వుండాలి. అందుకే దర్శక, నిర్మాతలు కూడా డిఫరెంట్‌ కంటెంట్‌తో ఆడియన్స్‌ మెప్పించే కథలతో నే సినిమాలు తీయాలని డిసైడ్‌ అయ్యారు. అయితే కొంత మంది మేకర్స్‌ మాత్రం అదే రొటిన్‌ కథలను నమ్ముకుని ఉన్నారు. అయితే హనుమాన్‌ చిత్రంతో కంటెంట్‌ వాల్యూ.. ఆ సక్సెస్‌ రుచి తెలుసుకున్న నిర్మాత నిరంజన్‌ రెడ్డి మరోసారి ఆ తరహా కథతోనే సినిమా తీయడానికి సన్నాహాలు చేస్తున్నాడని సమాచారం.

ఇటీవల ఆయన ప్రియదర్శి, నభా నటష్‌లతో నిర్మించిన చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి ఘోర పరాజయాన్ని చవిచూసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆయన తన నిర్మాణ సంస్జ ప్రైమ్‌ ఫో ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై మరో అత్యధిక భారీ చిత్రాన్ని ప్లాన్‌ చేస్తున్నారు. రామాయణం ఆధారంగా.. రామాయణాన్ని టచ్‌ చేస్తూ భారీ బడ్జెట్‌తో ఓ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. ఈ చిత్రం ద్వారా సినిమాటోగ్రాఫర్‌ రాజేష్‌ను దర్శకుడుగా పరిచయం కాబోతున్నాడు. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ కూడా మొదలైంది. అయితే ఈ చిత్రంలో తెలుగు, తమిళ భాషల్లో తెలిసిన నటీనటులను ఎంపిక చేసి పాన్‌ ఇండియా లెవల్‌ ఈ చిత్రాన్ని నిర్మించాలని ప్లాన్‌ చేస్తున్నారు.

Tags:    

Similar News