Hansika Motwani: భర్తకు దూరంగా పడుకుంటున్న హన్సిక.. ఎక్కడికెళ్లినా అలాగే చేస్తుందట!
బ్యూటీఫుల్ యాక్ట్రెస్ హన్సిక మోత్వాని తను కొనుక్కున్న వస్తువులకు ఇచ్చే విలువ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది.
దిశ, సినిమా: బ్యూటీఫుల్ యాక్ట్రెస్ హన్సిక మోత్వాని తను కొనుక్కున్న వస్తువులకు ఇచ్చే విలువ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. అంతేకాదు తన కలెక్షన్స్ ధరలతోతోపాటు తనకు ప్రైవసీ కావాలనుకున్నప్పుడు భర్తను ఎలా దూరం పెడుతుందో కూడా రీసెంట్ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ‘నా కలెక్షన్‌లో ఉన్న బ్యాగ్‌లన్నీ లక్షకు పైగా విలువైనవే ఉన్నాయి. రెస్టారెంట్, హోటల్, ఈవెంట్స్ ఎక్కడికెళ్లినా నా బ్యాగ్‌కు కూడా కుర్చీ కావాలి. భర్త్ సోహెల్‌తో డేట్‌కు బయటకు వెళ్లినపుడు కూడా టేబుల్ దగ్గర ఇద్దరికి కాదు.. ముగ్గురికి చైర్ వెయ్యాలని చెప్తా’ అని తెలిపింది. అలాగే తాను కాసేపు ఒంటరిగా ఉండాలనుకున్నా లేదా స్వేచ్ఛగా గాలీ పిల్చుకోవాలనుకున్నపుడు భర్తను వేరే గదిలో పడుకునేలా మోటీవేట్ చేస్తానని ఫన్నీగా చెప్పుకొచ్చింది.
Read More: పవన్ కల్యాణ్-సాయి ధరమ్ తేజ్ ‘బ్రో’ మూవీ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్..