బుల్లితెరపై సందడి చేయనున్న హన్సిక..
చాలా మంది హీరోయిన్లు తమ కెరీర్ తర్వాత టీవీ షోలకు ప్రాధాన్యత ఇస్తున్న సంగతి తెలిసిందే.
దిశ, సినిమా: చాలా మంది హీరోయిన్లు తమ కెరీర్ తర్వాత టీవీ షోలకు ప్రాధాన్యత ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు బుల్లితెర షోలకు జడ్జీ లుగా పనిచేశారు. ఇప్పుడు హన్సిక కూడా అదే బాటలో నడుస్తుంది.
ఈటీవీలో ప్రసారమయ్యే షోలను తెలుగు ప్రేక్షకులు ఎంతగా ఆదరిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా, డ్యాన్స్ ఢీ షో ప్రతి సీజన్‌కు కొత్త న్యాయనిర్ణేతని తీసుకువస్తుంది. ఢీ సెలబ్రిటీ సీజన్ ఇటీవల ముగిసింది. ఇప్పుడు మరో కొత్త సీజన్ మొదలైంది. తాజాగా విడుదలైన ప్రోమో చూస్తుంటే ఈసారి కూడా సెలబ్రిటీని మార్చినట్టు తెలుస్తుంది. గత సీజన్‌లో ప్రణీతను జడ్జీ గా వ్యవహరించింది. ఇప్పుడు, హన్సికను ఈ సీజన్‌కు జడ్జీ గా తీసుకొచ్చింది.
గతంలో శ్రియ లాంటి స్టార్ హీరోయిన్లు కూడా ఈ షోకి న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. ఇక హన్సిక ఈ షోకి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తుందని తెలియడంతో ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ షోకి సంబంధించిన ప్రోమో కూడా రీసెంట్ గా రిలీజైంది హన్సిక ఇందులో విపరీతమైన బజ్ క్రియేట్ చేసింది. మరో విశేషం ఏంటంటే.. హన్సికతో పాటు మాస్టర్ శేఖర్, మాస్టర్ గణేష్ కూడా జడ్జీలు గా వ్యవహరిస్తున్నారు.