అంగరంగవైభవంగా సౌత్ ఎడిషన్ హలో !(HELLO!) హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డులు
మొదటి ఎడిషన్ హలో ! హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డులు– సౌత్, ద్వారా పలు పరిశ్రమల వ్యాప్తంగా విశిష్ట వ్యక్తులను గుర్తించడంతో పాటుగా కళాకారులు, ప్రొఫెషనల్స్, సంస్థలను సైతం అట్టహాసంగా జరిగిన భారీ వేడుకలో గౌరవించారు.
దిశ, వెబ్‌డెస్క్: మొదటి ఎడిషన్ హలో ! హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డులు– సౌత్, ద్వారా పలు పరిశ్రమల వ్యాప్తంగా విశిష్ట వ్యక్తులను గుర్తించడంతో పాటుగా కళాకారులు, ప్రొఫెషనల్స్, సంస్థలను సైతం అట్టహాసంగా జరిగిన భారీ వేడుకలో గౌరవించారు.
ఆర్‌పీ–సంజీవ్ గోయెంకా గ్రూప్‌కు చెందిన హలో! (HELLO!) మ్యాగజైన్ తమ మొట్టమొదటి సౌత్ ఎడిషన్ 'హలో ! హాల్ ఆఫ్ ఫేమ్' అవార్డుల విజేతలను వెల్లడించింది. వినోద, వ్యాపార, ఇతర పరిశ్రమల రంగాలకు చెందిన విశిష్ట వ్యక్తులను ఈ అవార్డుల ద్వారా గుర్తించి, గౌరవించారు. ప్రారంభించిన నాటి నుంచి కూడా హలో! హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డులు పరిశ్రమలో అత్యంత గౌరవనీయమైన అవార్డులలో ఒకటిగా వెలుగొందుతుండటంతో పాటుగా ప్రతిభను గుర్తిస్తున్నాయి. ఈ అవార్డుల వేడుకకు నగరంలోని విశిష్ట వ్యక్తులు హాజరయ్యారు. మొట్టమొదటి 'హలో ! హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డులు– సౌత్' కార్యక్రమం హైదరాబాద్‌లో 24 జనవరి 2023న తాజ్‌కృష్ణ హోటల్‌లో జరిగింది.
'ఏ నైట్ ఎట్ ద ఒపెరా' నేపథ్యంతో అట్టహాసంగా జరిగిన ఈ అవార్డుల వేడుక ఫ్యాషనబుల్, ఉన్నత, ఆధునిక పోకడలు కలిగిన వ్యక్తుల కలయికగా సాగింది. దక్షిణ భారతదేశ వ్యాప్తంగా తారలు, సోషలైట్లు ఈ కార్యక్రమానికి హాజరు కావడంతో పాటుగా తమ ప్రతిష్టాత్మకమైన అవార్డులను వెంట తీసుకువెళ్లారు. అవార్డుల వేదికతో పాటుగా రెడ్ కార్పెట్ సైతం గ్లిట్జ్, గ్లామర్, ఉత్సాహంతో నిండిపోయింది. అద్భుతమైన ప్రదర్శనల మధ్యలో విజేతలను వెల్లడించారు. ఈ కార్యక్రమానికి హోస్ట్‌గా సోఫీ చౌదరి వ్యవహరించారు.
ఈ సందర్భంగా హలో! ఎడిటోరయల్ ఛైర్‌పర్సన్ అవర్ణ జైన్ మాట్లాడుతూ '' అత్యంత ప్రతిష్టాత్మకమైన హలో! హాల్ ఆఫ్ ఫేమ్ –సౌత్ అవార్డులను హలో! నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. సౌత్ స్టార్‌డమ్, పవర్, అద్భుతమైన ప్రతిభకు సాక్షిగా నిలవడం సంతోషంగా ఉంది. ఓ బ్రాండ్‌గా హలో! ఎప్పుడూ కూడా సృజనాత్మక ప్రతిభకు మద్దతు అందించడాన్ని గౌరవంగా భావిస్తుంది. మరీ ముఖ్యంగా ఔత్సాహిక లేదా ఇప్పటికే గుర్తింపు పొందిన వ్యక్తులను ఫ్యాషన్, సాహిత్యం, థియేటర్, సినీ, క్రీడలు, దాతృత్వరంగంలో గుర్తిస్తుంటాము. హలో ! హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డులు –సౌత్ అనేది గత కొద్ది సంవత్సరాలుగా మేము ఏర్పరుచుకున్న సుదీర్ఘ బంధానికి ప్రతీక'' అని అన్నారు.
హలో ! హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డులు –సౌత్ ద్వారా విభిన్న రంగాలలోని వ్యక్తులను గుర్తించడంతో పాటుగా దక్షిణ భారతదేశంలో ప్రతి విభాగానికీ తగిన ప్రాతినిధ్యం, వారందించిన తోడ్పాటుకు తగిన గౌరవం అందించాయి.
List of Winners is as below
Vijay Deverakonda - Breakthrough Superstar Of The Year
Adivi Sesh - Breakthrough Performance Of The Year
Hansika Motwani - Popular Choice Award
Mrunal Thakur - Rising Star Of The Year
Dulquer Salmaan - Most Stylish Star Of The Year
Aditi Rao Hydari - Most Beautiful Face Of The Year
Lakshmi Manchu - Versatile Actor Of The Year
Anushree Reddy - Fashion Designer Of The Year
Rajeev Reddy - Rising Entrepreneur Of The Year
Mahima Datla - Businesswoman Of The Year
Gitanjali Maini - Contribution Towards Building An Art Ecosystem
Thota Vaikuntam - Artiste Of The Year
PV Sindhu – Sports personality Of The Year
Kulsum Shadab Wahab – Philanthropist Of The Year
Vinita Chaitanya – Contribution To Interior Design
Swapna Dutt – Filmmaker Of The Year
Jaydev Galla - Business Leader Of The Year
Dulquer Salmaan – HELLO! Hall Of Fame Bingo Trendsetter Award
Dev Mohan – Promising Talent Of The Year
Shalini Bhupal – Art Patron Of The Year
T Rajeev Reddy – Rising Entrepreneur Of The ఇయర్
ఇవి కూడా చదవండి : ఈ అవార్డు నీకెప్పుడో దక్కాల్సింది: కీరవాణికి పద్మశ్రీపై రాజమౌళి పోస్ట్!