Guppedantha Manasu: దేవయాని నిజం స్వరూపం తెలుసుకున్న రిషి.. వేరు కాపురానికి సిద్దమైనట్లేనా..?

గుప్పెడంత మనసు ఎపిసోడ్ లో ఈ సీను హైలెట్

Update: 2023-10-16 05:14 GMT

దిశ,వెబ్ డెస్క్: గుప్పెడంత మనసు ఎపిసోడ్ లో ఈ సీను హైలెట్

‘పెద్దమ్మా మీరు నన్ను పెంచి పెద్ద చేశారు. మీరు నన్ను ఏమైనా అనండి.. కానీ మా డాడ్ ‌ని మాత్రం ఒక్క మాట అన్నా.. నేను ఒప్పుకోను.. దేవయాని మీద రిషి సీరియస్ అవుతాడు. మీరు నా ముందే ఇన్నేసి మాటలు మాట్లాడుతున్నారు.. మీరు అలా అంటుంటే నా గుండె పగిలిపోతుంది పెద్దమ్మా.. నా మనసు చంపుకుని నేను ఇక్కడ ఉండలేను’ అని రిషి అంటాడు రిషీ. ‘రిషీ .. మీ పెద్దమ్మ మాటలు పట్టించుకోకు అంటూ ఫణేంద్ర అడ్డుపడే ప్రయత్నం చేస్తాడు. ‘మా డాడ్ వల్ల మన కుటుంబ పరువు పోతుందట.. ఆ గౌరవాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత నాకుంది కదా పెదనాన్నా.. అందుకే డాడ్‌ని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్లి పోతాను అంటూ రిషి అంటాడు.

ఇక శైలేంద్ర బతిమలాడతాడు. ఫణేంద్ర రిక్వస్ట్ చేస్తాడు. దేవయాని.. కూడా తగ్గి.. నేను మంచి కోసమే చెప్పాను కదా రిషీ అంటుంది. ‘పెద్దమ్మ మాటలు నా గుండెకు బలంగా తాకాయి.. ఒకవేళ ఇక్కడ ఉన్నా ఎడముఖం పెడముఖంగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది.. నా తండ్రికి అవమానం జరిగిన నోట నేను ఒక్క క్షణం కూడా ఉండలేను’ అనేసి వసుధారను లగేజ్ సద్దమని ఆదేశిస్తాడు. ‘సార్ అదీ..’ అంటూ వసు ఎంత నచ్చజెప్పాలి అనుకున్నా వినడు రిషి.

Tags:    

Similar News