Guneet Monga: ఆస్కార్ ఇచ్చినా.. ఆ విషయంలో అవమానించారు: గునీత్ మోంగా

ఆస్కార్ అకాడమీ నిర్వాహకులపై ప్రముఖ నిర్మాత, ఆస్కార్ అవార్డు గ్రహిత గునీత్ మోంగా అసంతృప్తి వ్యక్తం చేసింది.

Update: 2023-03-18 07:41 GMT

దిశ, సినిమా : ఆస్కార్ అకాడమీ నిర్వాహకులపై ప్రముఖ నిర్మాత, ఆస్కార్ అవార్డు గ్రహిత గునీత్ మోంగా అసంతృప్తి వ్యక్తం చేసింది. కార్తికి గోన్సాల్వెన్స్‌ దర్శకత్వంలో ‘ది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌’ చిత్రాన్ని నిర్మించిన ఆమె.. ఈ చిత్రానికిగానూ బెస్ట్‌ డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిల్మ్‌ కేటగిరీలో ఆస్కార్‌ అందుకుంది. అయితే తాజాగా ఇండియాకు చేరుకున్న గునీత్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘అంతర్జాతీయ వేదికపై పురస్కారం అందుకోగానే సంబరపడ్డాం. కానీ, అకాడమీ చర్యల వల్ల ఆ ఆనందం కాసేపు కూడా లేకుండా పోయింది. ఇండియన్‌ ప్రొడక్షన్‌ కంపెనీకి మొదటిసారిగా దక్కిన పురస్కారమిది. దాని గురించి చాలా మాట్లాడాలనుకున్నా. అయితే 45 సెకన్లు మాట్లాడే చాన్స్ ఉన్నప్పటికీ.. నేను స్పీచ్ మొదలుపెట్టకముందే మ్యూజిక్‌ ప్లే చేశారు. దీంతో ఏమీ చెప్పకుండానే స్టేజ్‌ దిగాల్సి వచ్చింది. ఇండియాకు దక్కిని గౌరవాన్ని, గొప్ప క్షణాలను ఇచ్చినట్లే ఇచ్చి నా దగ్గరి నుంచి లాక్కున్నట్లు అనిపించింది. అది సరైన పద్థతి అనిపించలేదు’ అని ఆందోళన వ్యక్తం చేసింది. 

Also Read..

Himaja: నన్ను దారుణంగా ఏడిపించారు.. ఇక ఎవడు చెప్పినా ఆగేది లేదు 

Tags:    

Similar News