Gossips: రామ్‌ చరణ్.. ఉపాసన మధ్య ఆస్తి గొడవ.. చెర్రీకి భారీ షాకిచ్చిన మెగా కోడలు!

చిరంజీవి తనయుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి తెలిసిందే. మెగా వారసుడిగా సినీ పరిశ్రమలో గ్లోబల్ ఇమేజ్‌తో దూసుకుపోతున్నాడు.

Update: 2024-06-26 13:45 GMT

దిశ, సినిమా : చిరంజీవి తనయుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి తెలిసిందే. మెగా వారసుడిగా సినీ పరిశ్రమలో గ్లోబల్ ఇమేజ్‌తో దూసుకుపోతున్నాడు. ప్రజెంట్ శంకర్ డైరెక్షన్‌లో గేమ్ ఛేంజర్ మూవీ కంప్లీట్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఇక బుచ్చి బాబుతోనూ మరో సినిమా ఓపెనింగ్ అయిపోయింది కాబట్టి సెట్స్‌పైకి ఎంట్రీ ఇవ్వడమే తరువాయి. చరణ్ 2012లో ఉపాసన కామినేనిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. గత సంవత్సరం ఈ దంపతులకు పండండి బిడ్డ పుట్టగా క్లింకారా అని పేరు పెట్టారు. ఇటీవల తమ గారాల పట్టి క్లింకార ఫస్ట్ బర్త్ డేను కూడా ఫ్యామిలీతో కలిసి గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు ఉపాసన-రామ్ చరణ్ దంపతులు.

ఇదిలా ఉండగా ప్రస్తుతం చెర్రీ - ఉపాసన ఆస్తులకు సంబంధించిన ఓ గాసిప్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఏంటంటే.. దంపతులిద్దరిలో ఆస్తులు ఎవరికి ఎక్కువ ఉన్నాయనే విషయంలో సరదాగా మాట్లాడుకుంటుండగా ఇద్దరి మధ్య చిన్నపాటి వివాదం చెలరేగిందట. దీంతో వీరిద్దరూ కలిసి ఓ నిర్ణయానికి వచ్చారట. తమలో ఇద్దరి పేరుమీద సమానంగా కాకుండా ఎవరికి ఎక్కువ ఆస్తి ఉంటే వారు. ఆ ఎక్స్‌ట్రా ప్రాపర్టీని తమ గారాల పట్టి క్లింకార పేరుమీద సపరేట్ అకౌంట్ తీసి అందులోకి ట్రాన్స్ ఫర్ చేయాలని నిర్ణయించుకున్నారట. ఇక ప్రాపర్టీ విషయానికి వస్తే రామ్‌చరణ్-ఉపాసన ఇండియాలోని అత్యంత ధనిక సెలబ్రిటీ జంటలలో ఒకటిగా చెప్తుంటారు.

ఈ స్టార్ కపుల్ పేరు మీద ఇద్దరికీ కలిపి ఇప్పటికిప్పుడు రూ. 2,500 కోట్లకుపైగా ఆస్తి ఉండగా, వ్యక్తిగతంగా ఉపాసన పేరుమీద రూ. 1,130 కోట్లు, రామ్ చరణ్ పేరు మీద రూ. 1000 కోట్ల ఆస్తి ఉన్నట్లు సమాచారం. అంటే రాంచరణ్ కంటే ఉపాసన పర్సనల్ ప్రాపర్టీ రూ.130 కోట్లు అధికంగా ఉంది. ఇద్దరికీ సమాన ఆస్తి ఉండాలంటే.. తన పేరుమీద ఉన్న అదనపు ఆస్తి రూ. 130 కోట్లను ఉపాసన క్లింకార పేరుమీదకు బదలాయించాలి. కానీ తగాదాలో జరిగిన నిర్ణయం మేరకు ఉపాసన ఈ అదనపు ఆస్తిని ఇంకా తనపేరు మీదే ఉంచుకుందట. పైగా క్లింకార పేరుమీద ఉన్నా, తన పేరుమీద ఉన్నా ఒకటేనంటూ చెర్రీని దబాయిస్తోందట ఉపాసన. దీంతో వదినమ్మ అన్నయ్యకంటే కాస్త పైస్థాయిలో ఉండాలనే అలా చేస్తోందంటూ చెర్రీ ఫ్యాన్స్ కామెంట్ చేస్తు్న్నారు. ఎంత వరకు నిజమో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.


Similar News