గోపిచంద్ భీమా ట్విట్టర్ రివ్యూ.. థియేటర్లలో శివతాండవమే..
కన్నడ దర్శకుడు ఎ హర్ష డైరెక్షన్‌లో, గోపిచంద్ హీరోగా నటించిన భీమా మూవీ శుక్రవారం(నేడు) థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజైన విషయం తెలిసిందే. ఇక ఈ మూవీలో ప్రియా భవానీ శంకర్, మాళవికా శర్మ హీరోయిన్లుగా
దిశ, సినిమా : కన్నడ దర్శకుడు ఎ హర్ష డైరెక్షన్‌లో, గోపిచంద్ హీరోగా నటించిన భీమా మూవీ శుక్రవారం(నేడు) థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజైన విషయం తెలిసిందే. ఇక ఈ మూవీలో ప్రియా భవానీ శంకర్, మాళవికా శర్మ హీరోయిన్లుగా నటించారు. కాగా భీమీ ట్విట్టర్ రివ్యూ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
మంచి కంటెంట్, ఫుల్ మాస్ ఎలిమెంట్స్‌తో మూవీ సూపర్ ఉన్నదంట. పోలీస్ ఆఫీసర్‌గా గోపీచంద్ డైలాగ్స్, యాటిట్యూడ్, బాడీలాంగ్వేజ్ బాగున్నాయంటా, అంతే కాదండోయ్, ఇందులో మన హీరో తన ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ అందిస్తాడంట.
ఇక శివరాత్రి రోజు ఈ సినిమా రిలీజ్ కావడంతో, థియేటర్లలో గోపిచంద్ శివతాండవం చేశారని, మంచి మాస్ యాంగిల్‌లో ప్రేక్షకులను ఆకట్టుకుటుంన్నాడంటూ తెలుపుతున్నారు అభిమానులు . అలాగే భీమాతో గోపీచంద్ మళ్లీ హిట్టు ట్రాక్‌లోకి వచ్చాడని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ష్యూర్‌షాట్ బ్లాక్‌బస్టర్ అంటూ పేర్కొన్నాడు. కింజుసైజ్ కమ్ బ్యాక్ ఇదని చెబుతోన్నారు. ఇక హీరోయిన్స్ తమ అందం, నటన, గ్లామర్‌తో ఎంతగానో ఆకట్టుకున్నారు.