ఘనంగా ప్రారంభమైన హీరో గోపీచంద్ మూవీ..

స్టార్ హీరో గోపీచంద్, కన్నడ దర్శకుడు ఎ. హర్ష కాంబోలో ‘#Gopichand31’ సినిమా ఘనంగా ప్రారంభమైంది.

Update: 2023-03-03 12:40 GMT

దిశ, సినిమా: స్టార్ హీరో గోపీచంద్, కన్నడ దర్శకుడు ఎ. హర్ష కాంబోలో ‘#Gopichand31’ సినిమా ఘనంగా ప్రారంభమైంది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ నుంచి ప్రొడక్షన్ నెంబర్ 14 గా రానున్న అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను కె.కె రాధామోహన్ నిర్మించనుండగా.. శుక్రవారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా మాట్లాడిన చిత్ర నిర్మాత.. ‘మా ప్రొడక్షన్ నెంబర్ 14 లో హీరో గోపీచంద్, దర్శకుడు హర్ష తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. ఈ నెలలోనే సినిమా షూటింగ్‌ ప్రారంభిస్తాం’ అన్నారు.

అలాగే స్వామి జే సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తుండగా కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. రమణ వంక ప్రొడక్షన్ డిజైనర్ కాగా త్వరలోనే నటీనటులు, టెక్నికల్ టీమ్‌కు సంబంధించిన అన్ని వివరాలను అనౌన్స్ చేస్తామన్నారు మేకర్స్.

Tags:    

Similar News