Mahesh Babu - Trivikram : మూవీ నుంచి సాలిడ్ అప్ డేట్..

సూపర్ సార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ కోసం ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Update: 2022-11-27 04:42 GMT

దిశ, సినిమా: సూపర్ సార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ కోసం ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం మహేష్ , త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. దాదాపు 12 ఏళ్ల తర్వాత ఈ కాంబినేషన్ లో సినిమా రాబోతుండటంతో అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ప్రస్తుతం వరుసగా అన్న, అమ్మ, నాన్న ఇలా దూరం కావడంతో, మహేష్ కొండంత బాధలో ఉన్నాడు.. దీంతో ఈ సినిమాకు చిన్న బ్రేక్ పడింది. ఈ బాధ నుంచి కోలుకోగానే సినిమా షూటింగ్ తిరిగి మొదలు కానుంది. కాగా ఈ మూవీకి సంబంధించి ఓ వార్త చక్కర్లు కొడుతోంది.. ఎంటంటే ఓ సీనియర్ హీరోయిన్ స్పెషల్ క్యారెక్టర్ చేయబోతుందట. దీంతో పాటు ఈ చిత్రంలో ఓ టాప్ హీరోయిన్‌తో సాలిడ్ స్పెషల్ సాంగ్ కూడా ప్లాన్ చేస్తున్నారట.ఈ లేటెస్ట్ అప్ డెట్స్ విన మహేష్ అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు.




Read More......


సినిమాలకు సాయిపల్లవి గుడ్ బై..?? 

Tags:    

Similar News