దూసుకెళ్తున్న 'గాడ్‌ఫాద‌ర్'.. నాలుగు రోజుల్లోనే వంద కోట్లు

చిరంజీవి కథానాయకుడిగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'గాడ్ ఫాదర్'. అక్టోబర్ 5న దసరా కానుకగా విడుదలైన ఈ మూవీ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్టర్ హిట్‌‌గా నిలిచింది.. Latest Telugu News

Update: 2022-10-10 07:58 GMT

దిశ,సినిమా: చిరంజీవి కథానాయకుడిగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'గాడ్ ఫాదర్'. అక్టోబర్ 5న దసరా కానుకగా విడుదలైన ఈ మూవీ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్టర్ హిట్‌‌గా నిలిచింది. తొలి మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అయితే ఇందుకు సంబంధించిన అధికారిక పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. నిజానికి ఈ మూవీ విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌ తెచ్చుకొవడంతో పాటు ద‌స‌రా సెల‌వులు కూడా క‌లిసిరావ‌డంతో భారీ వ‌సూళ్లు రాబడుతున్నట్లు ట్రేడ్ వ‌ర్గాలు వెల్లడించాయి.

ఇవి కూడా చదవండి : ఆయన ఫిట్‌నెస్‌కు ఫిదా అయ్యాను : రాధికా ఆప్టే

ఇవి కూడా చదవండి : దేశం గర్వించే తెలుగు దర్శకుడి బర్త్ డే

Megastar @KChiruTweets's domination at the Box Office 🔥


Similar News