పదేళ్లు గడిచినా కొత్తగానే ఫీల్ అవుతున్నా: ప్రియాంక
దిశ, సినిమా: బ్యూటిఫుల్ ప్రియాంక చోప్రా హాలీవుడ్లో అడుగుపెట్టి పదేళ్లు పూర్తయింది.
దిశ, సినిమా: బ్యూటిఫుల్ ప్రియాంక చోప్రా హాలీవుడ్లో అడుగుపెట్టి పదేళ్లు పూర్తయింది. అమెరికన్ టీవీ షో 'క్వాంటికో'తో అరంగేట్రం చేసిన నటి.. 'అలెక్స్ పారిష్' పాత్రతో ఆడియన్స్‌ను మెప్పించింది. ఆ తర్వాత 'ది మ్యాట్రిక్స్ రిసరెక్షన్స్', 'బేవాచ్ అండ్ ఈజ్ నాట్ ఇట్' వంటి రొమాంటిక్ చిత్రాలతో గ్లోబల్ స్టార్ అయిపోయిన నటి.. అయినా సరే తానింక హాలీవుడ్‌కు కొత్తగా వచ్చినట్లుగానే ఫీల్ అవుతున్నానంటోంది. 'ఇంగ్లీష్ సినిమాలకు నేనింక కొత్తదానినే. ఇక్కడ 10 ఏళ్లపాటు పనిచేసిన తర్వాత నాకు నచ్చిన పాత్రలు చేసే స్థాయికి చేరుకున్నా. ఈ పరిశ్రమలో కష్టపడి పనిచేసిన క్రెడిబిలిటీని కలిగి ఉన్నా. ఉన్నత స్థాయికి చేరుకున్నానని అందరూ అనుకుంటున్నప్పటికీ నేను సాధించాల్సిన గోల్స్ ఇంకా ఉన్నాయి. భవిష్యత్తులో మరింత ఎత్తుకు ఎదిగేందుకు ఎన్ని సవాళ్లనైనా ఎదుర్కొంటా. సినీ పరిశ్రమకు నేను చేయాల్సింది ఇంకా చాలా ఉంది' అంటూ చెప్పుకొచ్చింది. చివరగా తన మొత్తం కెరీర్లో అత్యుత్తమ ఫిల్మ్ మేకర్స్, యాక్టర్స్‌తో పనిచేశానన్న ప్రియాంక.. ఇందుకు నిజంగా గర్విస్తున్నట్లు తెలిపింది.
Also Read : రష్మికకు షాకిచ్చిన బాలీవుడ్ హీరో.. ఆందోళనలో ఫ్యాన్స్..!