రేపు నా పుట్టినరోజు గిఫ్ట్స్ ఇవ్వండి కానీ ఎవరూ విష్ చేయొద్దు..
టాలీవుడ్ వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటారు.
దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటారు. పలు విషయాలపై స్పందిస్తూ ఇంట్రెస్టింగ్ పోస్టులతో సెన్పేషన్ క్రియేట్ చేస్తాడు. తాజాగా, ఆర్జీవీ ట్విట్టర్ వేదికగా ఓ ఆసక్తికర పోస్ట్‌తో వార్తల్లో నిలిచాడు. ‘‘ ఏప్రిల్ 7న నా పుట్టిన రోజు. దయచేసి ఎవరూ నాకు విష్ చేయవద్దు. ఎందుకంటే శుభాకాంక్షలు ఉచితంగా వచ్చేవి. కాబట్టి వాటితో ఎలాంటి ఉపయోగం లేదు. నాకు ఏదైనా తక్కువ రేటు గల బహుమతులైనా ఇవ్వండి. ఉచితం కంటే చౌకైన బహుమతులు ఉత్తమం’’ అంటూ ఆర్జీవి రాసుకొచ్చాడు. దీంతో అది చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు మీమ్స్ షేర్ చేస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు.
Tmrw the 7 th is my happy birthday..Please don’t wish me ..That’s because wishes are free and useless ..I am ok with cheap gifts ..CHEAP is better than FREE
— Ram Gopal Varma (@RGVzoomin) April 6, 2023ఇవి కూడా చదవండి: keeravani: ‘పద్మ శ్రీ’ అవార్డు అందుకున్న కీరవాణి.. గర్వంగా ఉందన్న రాజమౌళి