Gayathri Gupta: అమ్మాయిలకే శృంగార కోరికలు ఎక్కువ.. నాకు ఫీలింగ్స్ వస్తే ఆ పని చేస్తా: గాయత్రి గుప్తా సంచలన కామెంట్స్
యాంకర్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసి తర్వాత సినిమాల్లో హీరోయిన్ రేంజ్‌కు ఎదిగిన గాయత్రి గుప్తా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
దిశ, సినిమా: యాంకర్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసి తర్వాత సినిమాల్లో హీరోయిన్ రేంజ్‌కు ఎదిగిన గాయత్రి గుప్తా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలా పలు చిత్రాల్లో నటించింది. వాటిలో ముఖ్యంగా ‘ఫిదా’, ‘కొబ్బరి మట్ట’, ‘ఐస్ క్రీమ్ 2’, ‘మిఠాయి’ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. అలాగే ‘పెళ్లికి ముందు’, ‘సీత ఆన్ ద రోడ్’ అనే షార్ట్ ఫిల్మ్‌లతో ఫుల్ ఫేమస్ అయ్యింది. ఇలా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న సమయంలోనే క్యాస్టింగ్ కౌచ్ గురించి చెప్పి ఇండస్ట్రీని షేక్ చేసి.. రచ్చ రేపింది. అంతే కాకుండా బిగ్‌బాస్‌తో పాటు మరికొన్ని వివాదాల్లో భాగమైంది. ఇక అప్పటి నుంచి అనుకున్నంత రేంజ్‌లో అయితే ఆఫర్లు రావట్లేదు. కానీ వచ్చిన చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకుండా సద్వినియోగం చేసుకుంటుంది ఈ అమ్మడు. ఈ క్రమంలోనే ‘అన్‌స్టాపబుల్’, ‘ఫ్లాట్’, ‘డబుల్ ఇంజిన్’ వంటి వెబ్ సిరీస్‌లో తన అద్భుత మైన నటనతో మెప్పించి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నది.
ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న గాయత్రి గుప్తా సంచలన కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. 'అందరూ చెబుతున్నట్లుగా అబ్బాయిల కంటే అమ్మాయిలకే శృంగార కోరికలు ఎక్కువగా ఉంటాయి. వీటి వల్లనే ఇల్లీగల్ ఎఫైర్‌లు కూడా పెరుగుతున్నాయి. కొద్ది రోజులు డేటింగ్ చేయడం, కోరికలు తీరగానే విడిపోవడం చేస్తున్నారు. పెళ్లైన వాళ్ళు కూడా భర్త సుఖ పెట్టకపోతే ప్రత్యమ్నాయం చూసుకుంటున్నారు అని చెప్పింది. అదేవిధంగా ఇప్పుడు అమ్మాయిలకు శృంగార కోరికలు వస్తే కంట్రోల్ చేసుకునే శక్తిని కూడా పెంచుకోవాలి. ఆకలి వేస్తే అన్నం తింటేనే పోతుంది. కానీ శృంగారం అలా కాదు. అయినా అమ్మాయిలు అలాంటి పరిస్థితులు వస్తే కంట్రోల్ చేసుకోవాలి. నా వరకు అయితే నేను ఆ ఫీలింగ్స్ వస్తే కంట్రోల్ చేసుకుంటాను' అంటూ గాయత్రి గుప్తా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.