Mahesh Babu Wedding card: ఘట్టమనేని వారి వివాహ ఆహ్వానం.. వైరల్ అవుతున్న వెడ్డింగ్ కార్డ్

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు అందరికీ సుపరిచితమే. వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవల గుంటూరు కారం మూవీతో ప్రేక్షకులను అలరించాడు.

Update: 2024-07-18 11:49 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు అందరికీ సుపరిచితమే. వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవల గుంటూరు కారం మూవీతో ప్రేక్షకులను అలరించాడు. కానీ హిట్ సాధించలేకపోయాడు. ప్రస్తుతం సూపర్ స్టార్ దర్శకధీరుడు రాజమౌళితో SSMB మూవీ చేస్తున్నాడు. దీనికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే మహేష్ బాబు గ్యాప్ దొరికినప్పుడల్లా ఫ్యామిలీతో వెకేషన్‌కు వెళ్తున్నాడు. కానీ సోషల్ మీడియాకు పూర్తిగా దూరం అయ్యాడు. ఈ క్రమంలో.. తాజాగా, మహేష్ బాబు పెళ్లి కార్డు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. దీంతో అది చూసిన వారంతా మహేష్ బాబుకు పెళ్లై ఇద్దరు పిల్లలు పుట్టాక.. ఇప్పుడు మళ్లీ పెళ్లి జరగడం ఏంటని అనుకుంటున్నారు. కానీ అది నిజమైన పెళ్లి కాదు. మురారి మూవీ రీ రిలీజ్ కాబోతుండటంతో ఫ్యాన్స్ ఎడిట్ చేసిందని తెలుస్తోంది.

అందులో ఏముందంటే.. ‘‘ఘట్టమనేని వారి వివాహ ఆహ్వానము శుభమస్తు.. వరుడు మురారి ఘట్టమనేని సత్యనారాయణ (సత్తిపండు) కనిష్ఠ కుమారుడుని చంటి అన్నపూర్ణ దంపతుల కనిష్ఠ కుమార్తెకు వసుంధరకు ఇచ్చి శ్రీ క్రోధి నామ సంవత్సరం శ్రావణ శుక్ల పక్ష త్రయోదశి నాడు అనగా 09.08.2024న పూర్వ ఆషాడ లగ్నమందు వివాహం చేయుటకు నిర్ణయించారు. కావున తామెల్లరు కుటుంబ సమేతంగా వచ్చి నూతన వధూవరులను పేపర్ ముక్కలతో ఆశీర్వదించాలని కోరుతున్నాము’’ అని రాసుకొచ్చారు. అయితే మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ‘మురారి’ సినిమా ఆగస్టు 9న రీ రిలీజ్ కాబోతుండటంతో ఫ్యాన్స్ ఇలా ఓ పెళ్లి కార్డును ఎడిట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్త వైరల్ అవుతోంది.

 

 

Tags:    

Similar News