పబ్లిక్‌లో భర్తతో స్టార్ హీరోయిన్ రొమాన్స్.. తట్టుకోలేక జెలసీతో వెళ్లిపోయిన మరో హీరోయిన్(వీడియో)
టాలీవుడ్ చిలిపి హీరోయిన్ జెనీలియా గురించి సుపరిచితమే.
దిశ, సినిమా: టాలీవుడ్ చిలిపి హీరోయిన్ జెనీలియా గురించి సుపరిచితమే. ఈ బ్యూటీ సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పి.. బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్‌ని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. 2011లో వీరిద్దరు పెళ్లి చేసుకోగా.. ఈ ఇద్దరికి ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. తాజాగా వీరు ముంబయిలోని ఓ ఈవెంట్ కు హాజరయ్యారు. వీరితో పాటు టాలీవుడ్ హీరోయిన్ పూజా హెగ్దే కూడా పాల్గొంది. జెనీలియా-రితేష్ కలిసి రెడ్ కార్పెట్ పై వాక్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలో జెనీలియా తన భర్తను పట్టుకుని చిలిపిగా అల్లరి చేస్తూ నవ్వుతుంది. అందరి ముందు ఫొటో షూట్ మధ్యలో వీరిద్దరూ ఇలా రొమాంటిక్ గా కనిపించగా.. పక్కకున్న పూజా హెగ్డే కాస్త జెలసీగా ఫీల్ అయి సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్తుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో అవ్వగా.. పాపం పూజా హెగ్డే సింగిల్ కష్టాలు అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.