Ram Charan : టాప్ హీరో కొడుకైనా.. భార్యతో ఉన్నప్పుడు ఆ పని చేయాల్సిందేనంటున్న ఫ్యాన్స్!

బయట ఎంత గొప్ప వ్యక్తి అయినా భార్య ముందు తగ్గాల్సిందే అంటూ ఎన్నో సామెతలు ఉన్నాయి. అంతే కాకుండా భార్యభర్తలకు సంబంధించిన ఎన్నో మీమ్స్, జోక్స్ సోషల్ మీడియాలో

Update: 2023-03-09 05:36 GMT

 దిశ, వెబ్‌డెస్క్ : బయట ఎంత గొప్ప వ్యక్తి అయినా భార్య ముందు తగ్గాల్సిందే అంటూ ఎన్నో సామెతలు ఉన్నాయి. అంతే కాకుండా భార్యభర్తలకు సంబంధించిన ఎన్నో మీమ్స్, జోక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఇప్పుడు ఓ పాన్ ఇండియా హీరో ఫొటో చూసిన వారు కూడా అవునూ, ఈ స్టార్ హీరోకు కూడా ఆ సామెతలు వర్తిస్తాయంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

ఇంతకీ ఏం జరిగింది అనుకుంటున్నారా..మెగాస్టార్ చిరంజీవి తనయుడు, పాన్ ఇండియా హీరో రామ్ చరణ్ తేజ్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. త్రిబుల్ ఆర్ మూవీతో పాన్ ఇండియా రేంజ్‌లో క్రేజ్ సంపాదించుకున్నాడు. అలాంటి హీరో తన భార్యతో షాపింగ్ చేశాడు. అయితే దీనికి సంబంధించిన ఓ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో ఉపాసన ముందు నడుచుకుంటూ వస్తే, రామ్ చరణ్ మాత్రం చేతినిండా బ్యాగులతో నడుస్తూ వస్తున్నాడు. ఇక ఇది చూసిన మెగా అభిమానులు, పాపం రామ్ చరణ్ అంటూ కామెంట్స్ చేస్తే, మరికొందరు.. మగధీర మూవీలో 100 మందిని ఒంటి చేతితో నరికినా.. rrr మూవీలో ఇండియాలో సంచలనం సృష్టించి అమెరికాలో పెద్ద అవార్డు గెలుచుకున్నా, భార్యతో షాపింగ్ చేసేటప్పుడు అన్నీ మూసుకొని బ్యాగులు మోయాల్సిందే.. ఇదే లోకం తీరు అంటూ తెగ హడావిడి చేస్తున్నారు.

Read more:

ఉపాసన ప్రెగ్నెన్సీపై అనుమానాలు.. నార్మల్‌గా కనిపిస్తుందంటూ

Tags:    

Similar News