Roja : వామ్మో.. ఈమె మాజీ మంత్రి రోజానేనా.. పొట్టి డ్రెస్‌లో ఆ ఫోజు ఏంటీ?

సీనియర్ నటి, మాజీ మంత్రి రోజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈమె రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి , మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టిన ఈమె, 2024 ఎన్నికల్లో మాత్రం ఘోరంగా ఓటమి పాలైన

Update: 2024-08-06 10:54 GMT

దిశ, సినిమా : సీనియర్ నటి, మాజీ మంత్రి రోజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈమె రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి , మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టిన ఈమె, 2024 ఎన్నికల్లో మాత్రం ఘోరంగా ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత నుంచి రోజా ఎక్కువగా కనిపించలేదు. ఈమె చిత్ర పరిశ్రమలోకి రీ ఎంట్రీ ఇస్తుంది అంటూ అనేక వార్తలు వచ్చినప్పటికీ ఆమె నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు.

అయితే తాజాగా రోజా పొట్టి డ్రెస్‌లో కనిపించి అందరికీ షాకిచ్చింది. ఈమె ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత ఇటలీ వెకేషన్‌కు వెళ్లి అక్కడ ఎంజాయ్ చేస్తున్నట్లు సమాచారం. గతంలో రాజకీయాల్లో ఉన్నప్పుడు రోజా చీర అందం అంటూ చాలా విషయాలు చెప్పుకొచ్చింది. అలాంటిది ఇప్పుడు ఆమె పొట్టి డ్రెస్‌లో కనిపించే సరికి రోజాపై ట్రోలింగ్ ఎక్కువైంది. ఏంటీ మన ఆడపడుచు దేశం దాటగానే సంప్రదాయాలు కూడా మర్చిపోయిందా.. మరీ ఆ పొట్టి డ్రెస్ ఏంటీ.. నువ్వు సూపర్ పో అక్క అంటూ షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Tags:    

Similar News