డబుల్ ఇస్మార్ట్ సాంగ్‌లో మాజీ సీఎం కేసీఆర్ ఫేమస్ మీమ్ డైలాగ్!

ప్రముఖ నటుడు రామ్ పోతినేని నటించిన డబుల్ ఇస్మార్ట్ సినిమా నుంచి రెండో పాట ఇవాళ రిలీజ్ అయింది.

Update: 2024-07-16 13:34 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ నటుడు రామ్ పోతినేని నటించిన డబుల్ ఇస్మార్ట్ సినిమా నుంచి రెండో పాట ఇవాళ రిలీజ్ అయింది. ఈ పాట విడుదల అయిన కొద్ది సేపటికే వైరల్ అవుతోంది. ఎందుకంటే సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ వాయిస్ ‘ఏం చేద్దాం అంటవ్ మరి’ అనే డైలాగ్ ఈ పాటలో పెట్టారు. గతంలో కేసీఆర్ ఓ ప్రెస్‍మీట్‍లో అన్న ఈ మాట ఆ తర్వాత సామాజిక మాధ్యమాల్లో పాపులర్ అయిన విషయం తెలిసిందే. దీన్ని ఫేమస్ మీమ్‌గా నెటిజన్లు వాడుతుంటారు.

‘మార్ ముంత’ అనే ఈ సాంగ్ మధ్యలో ఈ డైలాగ్ పెట్టడంతో సాంగ్‌లో జోష్ మరింత పెరిగిందని రామ్ అభిమానులు చెబుతున్నారు. కాగా, యంగ్ హీరో ఉస్తాద్ రామ్ పోతినేని, స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్‍లో వస్తున్న డబుల్ ఇస్మార్ట్ చిత్రం. ఇస్మార్ట్ శంకర్ చిత్రానికి సీక్వెల్‍గా ఈ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. అయితే, మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ ఆధ్వర్యంలో రాహుల్ సిప్లిగంజ్, కీర్తన శర్మ ఈ పాటను ఫుల్ జోష్‍తో పాడారు.

Tags:    

Similar News