Priyanka Chopra: 22ఏళ్లలో తొలిసారి మేల్ యాక్టర్స్‌తో సమాన రెమ్యునరేషన్ : ప్రియాంక చోప్రా
ఏ రంగంలోనైనా స్త్రీ, పురుషుల పని తీరును ఒకేలా చూడాలి, సమాన వేతనాలు ఇవ్వాలని అభిప్రాయపడింది గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా.
దిశ, సినిమా: ఏ రంగంలోనైనా స్త్రీ, పురుషుల పని తీరును ఒకేలా చూడాలి, సమాన వేతనాలు ఇవ్వాలని అభిప్రాయపడింది గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. ‘మిగతా పరిశ్రమల్లో మాదిరిగానే బాలీవుడ్‌లో పురుషుల ఆధిపత్యం ఉందా?’ అనే ప్రశ్నకు సమాధానమిచ్చింది. ‘నేను నా గురించి చెప్తున్నాను. నేను కో లీడ్‌గా చేసిన సినిమాల్లో పురుషులతో సమానంగా పారితోషికం అందలేదు. కానీ మిగతా హీరోయిన్లకు ఇచ్చారని విన్నాను. అయితే మా తరం వారు దీని గురించి గట్టిగా మాట్లాడుతున్నారు కాబట్టి నెక్స్ట్ జనరేషన్‌కు అలాంటి పరిస్థితి ఉండదని అనుకుంటున్నారు. నేను ప్రస్తుతం అమెరికాలో ఓ షో చేస్తున్నా. 22 ఏళ్ల కెరీర్‌లో తొలిసారి సమాన పారితోషికం తీసుకున్నా. ముందుగా అమ్మాయిలు పనికి తగిన ప్రతిఫలం పొందేందుకు ధైర్యంగా మాట్లాడాలి. ఎంత మంది ఎగతాళి చేసినా నిలబడిన నేను.. ఇంత ఫేమస్ అవుతానని ఎప్పుడూ అనుకోలేదు’ అని చెప్పుకొచ్చింది.