‘రామబాణం’ నుంచి ఫస్ట్ సింగిల్.. ఐఫోన్ లిరికల్ వీడియో రిలీజ్
మాచో హీరో గోపీచంద్ తాజా చిత్రం ‘రామబాణం’ ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి.
దిశ, సినిమా: మాచో హీరో గోపీచంద్ తాజా చిత్రం ‘రామబాణం’ ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే శ్రీవాస్ దర్శకత్వం వహించిన యాక్షన్ మూవీనుంచి తాజాగా ఫస్ట్ సింగిల్ ‘ఐఫోన్ లిరికల్’ వీడియోను విడుదల చేశారు మేకర్స్. హై స్పీడ్ బీట్‌లతో కూడిన మాస్ డ్యూయెట్‌ను మిక్కీ జె మేయర్ కంపోజ్ చేయగా అద్భుతమైన వోకల్స్, సూపర్బ్ డ్యాన్సులు, క్లాసీ విజువల్స్‌తో ఇది మాస్ యుఫోరియాను సృష్టిస్తుంది.
తెలంగాణ యాసలో కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించిన ఈ పాటను రామ్ మిరియాల, మోహన భోగరాజ్‌ల వాయిస్ ప్రేక్షకులను మైమరపిస్తోంది. ఇక పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై భారీ బడ్జెట్‌తో టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించిన సినిమాలో డింపుల్ హయాతి కథానాయికగా నటించగా మే 5న ఈ మూవీ విడుదలకు సిద్ధమవుతోంది.
ఇవి కూడా చదవండి: ‘జిలేబి’ అందరికీ నచ్చే ఫన్ ఫుల్ ఎంటర్‌టైనర్: విక్టరీ వెంకటేష్